రాహుల్ గాంధీ అసలు మనిషే అయితే.. అక్కడి నుంచి పోటీ చేయాలి: సవాల్ విసిరిన బీజేపీ

By Rajesh KarampooriFirst Published Dec 21, 2022, 6:18 AM IST
Highlights

బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మరోసారి మాటాల యుద్దం ప్రారంభమైంది. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి  టార్గెట్ చేస్తూ బీజేపీ సవాల్ విసిరింది. రాహుల్ గాంధీ మనిషైతే వచ్చే లోక్‭సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలని బీజేపీ నేత అమిత్ మాల్వియా సవాల్ విసిరారు. 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ చేసిన ‘లాట్కే, జాట్కే’ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. తాజాగా.. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి  టార్గెట్ చేస్తూ.. బీజేపీ ఒక సవాల్ విసిరింది. రాహుల్ గాంధీ బలమైన నాయకుడైతే ( మనిషైతే) 2024లో అమేథీ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మరోసారి ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ దమ్మున్న నాయకుడైతే.. అజయ్ రాయ్ లాంటి నేతల వెనుక దాక్కోవద్దని మాలవీయ అన్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ ఒక్క సీటు నుంచి మాత్రమే పోటీ చేయాలని మరో కండీషన్ మాలవీయ పెట్టాడు. రాహుల్ గాంధీ ఈ ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 

స్మృతి ఇరానీపై అజయ్ రాయ్ అనుచిత వ్యాఖ్యలు

రాబర్ట్స్‌గంజ్‌లోని షాహీ ప్యాలెస్‌లో సోమవారం నాడు  కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ విలేకరులతో మాట్లాడారు. 'స్మృతి ఇరానీ 'లాట్కే, జాట్కే' చూపించడానికి మాత్రమే అమేథీకి వస్తారని వ్యంగ్యంగా అన్నారు. 'కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రకు ప్రతి వర్గం నుండి మద్దతు లభిస్తోంది. దీన్ని బట్టి దేశానికి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీ మాత్రమేనని స్పష్టమైందన అన్నారు. స్మృతి ఇరానీ పై అజయ్‌రాయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది.

జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు 

అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్య తర్వాత స్మృతి ఇరానీ తనదైన శైలిలో ప్రతిస్పందించారు.'మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు. అది వారి(కాంగ్రెస్) సంస్కారానికి సంబంధించిన విషయం కావచ్చు. గాంధీ కుటుంబానికి పరుష పదజాలం ఇష్టమైతే.. అసభ్య పదజాలం వాడే ఏ కాంగ్రెస్ వాది క్షమాపణ ఎందుకు చెబుతారు అని ఘటూగా స్పందించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నేత అజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ దృష్టి సారించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై విచారణ ఇవ్వాల్సిందిగా.. మహిళ కమిషన్ డిసెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని అజయ్ రాయ్‌కి నోటీసు పంపింది.

కాంగ్రెస్ కు అమేథీ కంచుకోట.ఈ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ,అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో వారసత్వ సంపదలుగా వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. కానీ.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అనే రికార్డు బ్రేక్ అయ్యింది.

click me!