ఐదారేళ్ల‌లో బీజేపీ అంత‌మైపోతుంది.. దాని ప‌త‌నం బీహార్ నుంచి మొద‌లైంది - ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీం ఉద్దీన్

Published : Aug 24, 2022, 04:39 PM IST
ఐదారేళ్ల‌లో బీజేపీ అంత‌మైపోతుంది.. దాని ప‌త‌నం బీహార్ నుంచి మొద‌లైంది - ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీం ఉద్దీన్

సారాంశం

మరి కొన్నేళ్లలో అస్సాం నుంచి  బీజేపీని సాగనంపుతామని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయా అన్నారు. కాంగ్రెస్ నుంచి పలువురు ముఖ్య నేతలు త్వరలోనే తమ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. 

వ‌చ్చే ఐదు నుంచి ఆరేళ్లలో అస్సాంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతమైపోతుందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయా అన్నారు. ఈ  మేర‌కు బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీహార్ లో జ‌రిగిన ప‌రిణామాలు బీజేపీ ప‌త‌నానికి నాంది అని అన్నారు. ప్ర‌జ‌లు మళ్లీ ఆ పార్టీని అంగీకరించ‌బోర‌ని తెలిపారు.

నో మోర్ పాలిటిక్స్.. ఇక ప్ర‌జా జీవిత‌మే.. : మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు

అస్సాంలోని సోనాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బ‌ర్బూయా.. త‌మ పార్టీ బ‌లోపేతం అవుతోంద‌ని చెప్పారు. కాంగ్రెస్ అస్సాం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బార్‌పేట జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ 2వ తేదీన AIUDF చేర‌బోతున్నార‌ని చెప్పారు. కాగా.. ఏప్రిల్ 21న AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కాంగ్రెస్‌ను ‘మునిగిపోతున్న ఓడ’గా అభివర్ణించారు తాజాగా అస్సాం నుంచి బీజేపీని తమ పార్టీ  తొలగిస్తుందని అన్నారు. 

అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి రిపున్ బోరా వైదొలగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యం కోల్పోతున్నదని అన్నారు. కాబట్టి కాబట్టి AIUDF పుంజుకోవాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వారితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు వచ్చే నెలలో పార్టీలో చేరతారని తెలిపారు. 

ఉచితాల‌పై చ‌ర్చించేందుకు అఖిలపక్ష స‌మావేశాన్ని ఎందుకు పిలవకూడదు ?- కేంద్రానికి సుప్రీంకోర్టు ప్ర‌శ్న

‘‘ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాతో వేదిక పంచుకుంటారని ఆరు నెలల క్రితమే చెప్పాను. 2-3 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌ను కూడా కలిశారు. మాకు ఉప ఎన్నికలు వద్దు. , కాబట్టి మేము వేచి ఉన్నాము. 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ’’ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఏఐయూడీఎఫ్ లో పలువురు కాంగ్రెస్‌ నేతలు త‌మ పార్టీలో చేరబోతున్నారని, రాబోయే కొన్నేళ్లలో రాష్ట్రంలో బీజేపీని పార్టీ తరిమికొడుతుందని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu