మొఘల్స్ ధ్వంసం చేసిన 36,000 ఆలయాలను బీజేపీ పునరుద్ధరిస్తుంది - కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప

By team teluguFirst Published May 27, 2022, 1:05 PM IST
Highlights

కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మరో వివాదానికి తెరలేపారు. మొఘల్స్ కాలంలో  36,000 హిందూ దేవాలయాలు ధ్వసం చేశారని, ఇప్పుడు వాటిని బీజేపీ ప్రభుత్వం పునరుద్దరణ చేస్తుందని అన్నారు. అయితే శాంతియుతంగానే ఈ సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. 

36,000 దేవాలయాలను మొఘల్ పాలకులు ధ్వంసం చేశారని, వాటన్నింటినీ తమ పార్టీ పునరుద్ధరిస్తుందని బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. అవినీతి ఆరోపణలతో ఇటీవల కర్ణాటక మంత్రివర్గం నుండి తొలగించబడిన ఈశ్వరప్ప తాజాగా మ‌రో వివాదానికి తెర‌లేపారు. ఆయ‌న మాండ్య జిల్లాలోని జామియా మసీదు అంశాన్ని కూడా లేవనెత్తారు.

గురువారం ఓ స‌భ‌కు హాజ‌రై అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కే.ఈశ్వ‌ర‌ప్ప మాట్లాడారు. ‘‘ శ్రీరంగపట్నంలో ఒక దేవాలయాన్ని తరలించి, దాని స్థానంలో మసీదు ఎందుకు నిర్మించారు? మొత్తం 36,000 దేవాలయాలను మొఘలులు ధ్వంసం చేశారు, వాటన్నింటినీ పునరుద్ధరిస్తాం ’’ అని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఘర్షణలూ లేకుండా మొత్తం 36,000 దేవాలయాలను పునరుద్ధరిస్తామని, కోర్టు తీర్పుల ప్రకారం శాంతియుతంగా చట్టానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

Bharat Drone Mahotsav 2022: ర‌క్ష‌ణ‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది: ప్ర‌ధాని మోడీ

‘‘ నేడు, ముస్లింలు కూడా శ్రీరంగపట్నలో హనుమాన్ ఆలయం ఉందని అంగీకరిస్తున్నారు. ఆ సమయంలో వారు ఆలయాన్ని అవతలి వైపునకు మార్చి హనుమాన్ ఆలయాన్ని రక్షించారు, కానీ ఆలయాన్ని ఎందుకు మార్చారు? దాని స్థానంలో ఒక మసీదును ఎందుకు నిర్మించారు? దీనిపై కాంగ్రెస్ ఏమంటుంది ’’ అని ఆయన ప్రశ్నించారు.

మసీదులో ప్రార్థనలు చేయడానికి అనుమతి కోరుతూ ఒక రైట్ వింగ్ గ్రూప్ మాండ్య అధికార యంత్రాంగానికి ఒక వినతి పత్రాన్ని కొంత కాలం కిందట అందజేసింది. హనుమాన్ ఆలయంపై మసీదు నిర్మించారని, హిందూ దేవతల విగ్రహాలు ఇప్పటికీ మసీదు లోపలే ఉన్నాయని ఆ గ్రూప్ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని టిప్పు సుల్తాన్ మాజీ రాజధాని శ్రీరంగపట్నలోని జామియా మసీదు చుట్టూ ఈ శ్రీరంగపట్న సమస్య తిరుగుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందూ, ముస్లింల మ‌త‌ప‌ర‌మైన ప్రార్థనాల‌యపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క మాజీ మంత్రి వ్యాఖ్య‌లు ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. మొదటగా ఈ చర్చ హరిద్వార్ లోని జ్ఞానవాపి మసీదు దగ్గర మొదలైంది. ఆ మసీదులో హిందూ ఆలయం ఉందని గత కొంత కాలం నుంచి వాదనలు వినిపించడంతో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వీడియోగ్రాఫిక్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో శివలింగం లాంటి నిర్మాణం భయటపడిందని కొందరు చెబుతున్నారు. అయితే అది శివలింగం కాదని వాటర్ ఫౌంటేన్ అని మరి కొందరు వాదిస్తున్నారు. 

ఈ వాదలను ఇలా కొనసాగుతుండగానే ఢిల్లీలోని కుతుబ్ మినార్‌ కాంప్లెక్స్‌లోనూ తవ్వకాలు జరపాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.కుతుబ్ మినార్‌ను హిందూ పాలకుడు రాజా విక్రమాదిత్య నిర్మించాడని గ‌త కొంత కాలం నుంచి వాద‌నలు వినిపిస్తున్నాయి. ఆ ఆల‌య‌స‌ సమీపంలో హిందూ దైవం, ఇతర విగ్రహాలు బయ‌ట‌ప‌డ్డాయ‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కుతుబ్ మినార్ ప‌రిస‌రాల్లో ఐకానగ్రఫీ చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక ఏఎస్ఐకు ఆదేశాలు ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు షాక్.. ఇక అన్ని వర్సిటీలకు దీదీనే ఛాన్సలర్..నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

అయితే ఈ చర్చపై సద్గురు జగ్గీవాసుదేవ్ స్పందించారు. ఈ విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  దురాక్రమణల కాలంలో ధ్వంసమైన హిందూ ఆలయాల గురించి ఇప్పుడు మాట్లాడటం దండగ అని అన్నారు. భారత్ ఇప్పుడు కీలక ఘట్టంలో ఉన్నదని, ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ప్రపంచంలో మన దేశాన్ని ఏ శక్తీ ఆపలేదని సద్గురు అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చడాన్ని వదులుకోవాలని తెలిపారు.

click me!