కోల్‌కతాలో బీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jun 12, 2019, 03:11 PM IST
కోల్‌కతాలో బీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

సారాంశం

ఎన్నికల సందర్భంగా మొదలైన గొడవలు పశ్చిమ బెంగాల్‌లో నేటికి సద్దుమణగకపోగా.. మరింత ఎక్కువై, రాష్ట్రం రావణకష్టంగా మారుతోంది. తాజాగా తమపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది

ఎన్నికల సందర్భంగా మొదలైన గొడవలు పశ్చిమ బెంగాల్‌లో నేటికి సద్దుమణగకపోగా.. మరింత ఎక్కువై, రాష్ట్రం రావణకష్టంగా మారుతోంది. తాజాగా తమపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.

బెంగాల్ ప్రభుత్వం దాడులను ఆపాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఎంతగా వారించినా ఆందోళనకారులు వెనక్కి వెళ్లకపోవడంతో పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యాన్లను ప్రయోగించి కార్యకర్తలను చెదరగొట్టారు.

ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల నుంచి నేటి వరకు బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తల దాడులపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీజేపీ హెచ్చరించింది. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?