జర్నలిస్ట్ నోట్లో మూత్రం పోసి... పోలీసుల దాడి( వీడియో)

Published : Jun 12, 2019, 11:38 AM IST
జర్నలిస్ట్ నోట్లో మూత్రం పోసి... పోలీసుల దాడి( వీడియో)

సారాంశం

ఓ వీడియో జర్నలిస్టుపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. నోట్లో మూత్రం పోసి... ఒక రోజంతా గదిలో బంధించి... దుస్తులు లాగేసి... అతి దారుణంగా హింసించారు. 

ఓ వీడియో జర్నలిస్టుపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. నోట్లో మూత్రం పోసి... ఒక రోజంతా గదిలో బంధించి... దుస్తులు లాగేసి... అతి దారుణంగా హింసించారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... న్యూస్ 24 ఛానెల్ కి చెందిన ఓ వీడియో జర్నలిస్ట్ అమిత్ శర్మ... ఇటీవల రైలులో అనధికారిక  వ్యాపారుల (హాకర్స్‌) పై కథనాన్ని ప్రచురించారు. కాగా... ఈ అతనిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. అతని కెమేరాను పగలకొట్టారు. ఆ సమయంలో  పోలీసులు యూనిఫాంలో కాకుండా మాములు దుస్తులో ఉన్నారు. కాగా... ఈ ఘటనంతా వీడియోలో రికార్డు అయ్యింది.

దీనిపై బాధితుడు మాట్లాడుతూ.. ‘‘ నన్ను దారుణంగా కొట్టారు. నా కెమేరాను కూడా పగలగొట్టారు.  నా నోట్లో  మూత్రం పోశారు. నాదుస్తులు లాగి పడేశారు. ఒక రోజంతా నన్ను గదిలో బంధించారు.’’ అని చెప్పాడు. అయితే.... రైల్వే పోలీసులు అతనిని కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో... ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు.

జర్నలిస్టుపై దాడికి పాల్పుడిన రైల్వే ఇన్ స్పెక్టర్ రాకేష్ కుమార్, మరో కానిస్టేబుల్ ని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?