కశ్మీర్ లోయలో మరోసారి ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన అల్లరి మూకలు..

Published : May 03, 2022, 11:26 AM IST
కశ్మీర్ లోయలో మరోసారి ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన అల్లరి మూకలు..

సారాంశం

కశ్మీర్ లోయలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతనాగ్ జిల్లాలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని నినాదాలు చేసిన యువకులు.. భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వారు.

కశ్మీర్ లోయలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతనాగ్ జిల్లాలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని నినాదాలు చేసిన యువకులు.. భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వారు. రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసిన అనంతరం మసీదు వెలుపల భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడి జరిగిందని చెబుతున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటలనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఆ ప్రాంతంలో భద్రతను పెంచాయి. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. 

భద్రతా బలగాలపైకి కొందరు యువకులు రాళ్లు రువ్వుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం..రంజాన్ సందర్భంగా మసీదులో ప్రార్థనల సమయంలో  కొంతమంది దుండగులు free Kashmir నినాదాలు చేశారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో దుండగులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?