బీజేపీ అగ్రనేత ఎల్.కే.అడ్వాణీకి అనారోగ్యం

By Nagaraju penumalaFirst Published Aug 14, 2019, 8:51 PM IST
Highlights

గత కొంతకాలంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తోంది బీజేపీ. అయితే అనారోగ్యం కారణంగా దాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం అడ్వాణీ వయస్సు 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన అడ్వాణీ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ఉపప్రధానిగా పనిచేశారు ఎల్ కే అడ్వాణీ. 
 
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ నారోగ్యం పాలయ్యారు. గత ఐదురోజులుగా అడ్వాణీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని పార్టీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన వెల్లడించింది. అందువల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపింది. 

గత కొంతకాలంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తోంది బీజేపీ. అయితే అనారోగ్యం కారణంగా దాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం అడ్వాణీ వయస్సు 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన అడ్వాణీ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ఉపప్రధానిగా పనిచేశారు ఎల్ కే అడ్వాణీ. 

ఇకపోతే ఇటీవలే పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ సైతం అనారోగ్యం పాలయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొన్ని రోజుల క్రితం ఎయిమ్స్ లో చికిత్సపొందారు. అనారోగ్యం కారణంగా కేంద్రమంత్రి పదవిని సైతం తిరస్కరించారు అరుణ్ జైట్లీ. 

click me!