స్వతంత్ర పోరాటం తర్వాత అయోధ్య ఉద్యమమే: సుప్రీం తీర్పుపై అద్వానీ వ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Nov 9, 2019, 9:04 PM IST
Highlights

ఇది ఎంతో ఆనందకరమైన క్షణమని.. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడని అద్వానీ వ్యాఖ్యానించారు. 

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ స్పందించారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన ఇది ఎంతో ఆనందకరమైన క్షణమని.. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడని అద్వానీ వ్యాఖ్యానించారు.

భారతదేశ స్వాతంత్య్రోద్యమం తర్వాత అయోధ్యలో రామమందిరం కోసం సాగిన ఉద్యమమే అతిపెద్దదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిలో పాల్గొన్నందుకు గర్వంగా ఉందన్న అద్వానీ.. సుధీర్ఘ పోరాటానికి సుప్రీం తీర్పుతో ఫలితం వచ్చిందన్నారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఆయన నిర్వహించిన రథయాత్ర సంచలనం కలిగించింది. ఈ యాత్ర ముగింపు సమయంలోనే కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేయడం అల్లర్లకు కారణమైంది. 

Also Read:రామ్, రహీమ్ భక్తి కాదు.. దేశభక్తి కావాలి: ప్రధాని నరేంద్రమోడీ

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

Also Read:Ayodhya Verdict ఈ తీర్పు అద్వానీకి అంకితం: బీజేపీ నేత ఉమాభారతి

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది.

శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

click me!