మహారాష్ట్రపై ఇది బి‌జే‌పి పోలిటికల్ స్ట్రయిక్: ఉద్ధవ్ ఠాక్రే

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2019, 1:10 PM IST
Highlights

కొత్త రకం హింధూత్వం అని ఉద్దవ్ థాక్రే అన్నారు. ఇది కేవలం మహారాష్టలోనే కాదని మొత్తం దేశమంతా ఇదే తరహా పనులు బి‌జే‌పి చేస్తుందని అన్నారు.

కొత్త రకం హింధూత్వం అని ఉద్దవ్ థాక్రే అన్నారు. ఇది కేవలం మహారాష్టలోనే కాదని మొత్తం దేశమంతా ఇదే తరహా పనులు బి‌జే‌పి చేస్తుందని అన్నారు.శివ సేన, ఎన్సీపీ పార్టీల ఉమ్మడి ప్రెస్ మీట్ లో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ఇది బీజేపీ పార్టీ యొక్క నయా హిందుత్వ అని బీజేపీ రాజకీయాలను విమర్శించారు.

ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని,మహారాష్ట్ర ప్రజలను అగౌరవ పరచడమేనని ఆఖ్యన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విలువలకు బీజేపీ తిలోదకాలు ఇచ్చిందని ఆయన దుయ్యబట్టారు. 

Also read: ఎమ్మెల్యేలంతా మా వైపే, అజిత్ పవార్ ఒక్కడే: శరద్ పవార్

బీజేపీ పార్టీకి ఇలా నయాన్నో భయాన్నో,సర్కార్లను ఏర్పాటు చేయడం అలవాటయిపోయిందని ఆయన విమర్శించారు. కేవలం మహారాష్ట్రలోని కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పనులు మనకు కనపడతాయని ఆయన అన్నారు. 

హర్యానా ఉదాహరణను చూపిస్తూ మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉన్న దుశ్యంత్ చౌతాలాను పట్టుకొని ప్రభుత్వక్న్ని ఏర్పాటు చేసారానిన్ అన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంపై బీజేపీ పొలిటికల్ స్ట్రైక్ ఇది ఆయన ధ్వజమెత్తారు. 

మా సంఖ్యా బలం మాకుంది, ప్రభుత్వాన్ని మేమే తప్పకుండ ఏర్పాటు చేస్తాం అని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

click me!