‘‘హర్ ఘర్ తిరంగా’’తో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి బీజేపీ.. తెలంగాణపై ప్రకటన ఉంటుంది: వసుంధరా రాజే

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 5:16 PM IST
Highlights

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే మీడియాతో మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించబడనున్నట్టుగా తెలిపారు. అందులో ఒకటి రాజకీయ ప్రతిపాదన కాగా,  రెండోవది ఆర్థిక వ్యవస్థ, పేదల సంక్షేమానికి సంబంధించినదని చెప్పారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ ప్రతిపాదనల ముసాయిదాపై చర్చించినట్టుగా చెప్పారు. 

'హర్ ఘర్ తిరంగా' వంటి అనేక కొత్త కార్యక్రమాలను పార్టీ ప్రారంభిస్తుందని వసుంధరా రాజే చెప్పారు. 'పన్నా ప్రముఖ్'ని మరింత బలోపేతం చేయనున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో పార్టీకి సంబంధించి కూడా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రకటన వెలువడుతుందన్నారు. ఉదయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన హత్య, నూపుర్ శర్మ వివాదాస్పద ప్రకటనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు.. రాజకీయ పరిష్కారానికి సంబంధించిన అంశాలను NEC నిర్ణయిస్తుందని వసుంధర రాజే చెప్పారు.

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలు, రాంపూర్, అజంగఢ్, త్రిపుర ఉప ఎన్నికలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించినట్లు వసుంధరా రాజే చెప్పారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు..  పెద్ద ఉద్యమంగా చేసేందుకు బీజేపీ Har Ghar Tirangaను (ప్రతి ఇంటికి జాతీయ పతాకం) ప్రారంభించనుందని ఆమె చెప్పారు. ఈ ప్రచారం సందర్భంగా 20 కోట్ల మందికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 

బూత్‌ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించినట్టుగా వసుంధరా రాజే చెప్పారు. ప్రతి బూత్‌లో 200 మంది క్రియాశీల కార్యకర్తలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి, వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.  ‘‘మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలింది, నేడు మొత్తం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు సగటున 6 శాతంగా ఉంది. అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8.7 శాతంగా పురోగమిస్తోంది. ఇది కూడా మన ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం’’ అని వసుంధరా రాజే చెప్పారు. 

click me!