చిక్కుల్లో సన్నీ డియోల్.. ఎంపీ పదవి పోనుందా?

Published : Jun 19, 2019, 02:55 PM IST
చిక్కుల్లో సన్నీ డియోల్.. ఎంపీ పదవి పోనుందా?

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నిడియోల్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం వచ్చి పడింది. సన్నీ డియోల్ కి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నిడియోల్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం వచ్చి పడింది. సన్నీ డియోల్ కి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఆయన పరిమితికి మించి ఖర్చు చేశారంటూ ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన తన ఎంపీ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి.

ఎన్నికల కోడ్ ప్రకారం.. ఒక్కో ఎంపీ అభ్యర్థి రూ.70లక్షల వరకు ఖర్చు చేసే వీలు ఉంటుంది. అయితే... సన్నీ డియోల్ మాత్రం రూ.86లక్షలు ఖర్చు చేశారట.సన్నీడియోల్ ఎన్నికల నియమావళిని ఉల్లంగించి అధికంగా ఖర్చు చేశారని పోల్ వాచ్‌డాగ్‌కు ఫిర్యాదు అందింది.
 
ఎన్నికల నియమావళిని అధిగమించి పరిమితికి మించి ఖర్చు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఒక వేళ గెలిచిన అభ్యర్థి అధికంగా ఖర్చు చేసినట్లు నిరూపితమైతే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించే విచక్షణాధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది.
 
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి సన్నీ డియోల్ పోటీ చేసి గెలిచారు. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి సునీల్ జఖర్ పోటీ చేశారు. ఇద్దరికీ 80,000 ఓట్ల తేడా ఉంది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !