CDS Bipin Rawat: ప్ర‌మాదం వెనుక కుట్ర కోణం .. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Rajesh KFirst Published Dec 9, 2021, 1:22 PM IST
Highlights

CDS Bipin Rawat:  భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు.  తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన  రావత్ ప్రాణాలను కాపాడేందుకు డాక్ట‌ర్లు ఎంత‌గానో ప్ర‌యత్నించారు. అయినా.. ఆయ‌న ప్రాణాలు దక్కలేదు. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. యావ‌త్ భార‌తం .. ఈ ప్రమాదంపై  దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్ర‌మాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప‌లు అనుమానాలు వ్యక్తం చేశారు. 

CDS Bipin Rawat: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని కలచివేసింది. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్ట‌ర్లు ఎంత‌గానో ప్ర‌యత్నించారు. అయినా..  ఫలితం దక్కలేదు. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. యావ‌త్ భార‌తం .. ఈ ప్రమాదంపై  దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. 

ఈ ప్రమాదం ఎలా జరిగింది..? సాంకేతిక లోపాలేనా..? ఏదైనా కుట్ర ఉందా..? అనే విషయాలపై ప‌లు అనుమానులు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌లువురు నేత‌లు కూడా సందేహాలు వ్య‌క్తం చేస్తోన్నారు. ఈ క్ర‌మంలో  నేవీ అధికారుల‌కు  బ్లాక్‌బాక్స్ దొరికింది. ఈ బ్లాక్ బాక్స్ లో ఏముంది?  ప్ర‌మాద స‌మ‌యంలో ఏం మాట్లాడుకున్నారు. అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగింది. అనే విష‌యాలు ఆ బ్యాక్ బాక్స్ లో ఉంటాయి. ఈ బ్యాక్ బాక్స్ ను  ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ నిపుణుల బృందాలు ఘటనాస్థలిలో వెతికాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలోని 300 మీటర్ల నుంచి కిలోమీటరు పరిధిలో గాలించారు. ఈ ప‌రికరాన్ని డీ కోడ్ చేసి.. ప్ర‌మాదానికి ముందు మాట్లాడ‌రో తెలుస్తోంది. 

Read Also:  https://telugu.asianetnews.com/national/chief-of-defence-staff-general-bipin-rawat-passed-away-in-a-iaf-chopper-crash-in-tamil-nadu-r3srik

ఇదిలా ఉంటే.. ప్ర‌మాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనపై ఆయ‌న కీల‌క వ్యాఖ్యలు చేశారు. బిపిన్ రావత్ ఎంతో నిబద్ధత కలిగిన అధికారి అని, ప్రభుత్వాలకు భయపడే రకం కాదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలిపారు. చైనాతో భార‌త్ కు ముప్పు పొంచి ఉందని ఆయన పదే పదే చెప్పేవారని స్వామి గుర్తుచేశారు. ఈ ప్ర‌మాదం సైబర్ వార్ ఫేర్ కారణంగా ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని స్వామి అనుమానాలు వ్యక్తం చేశారు.
 
ఆర్మీ విమానం కూలిపోవ‌డం వెనుక కుట్ర కోణం ఉంద‌ని అన్నారు. ఈ సంఘ‌ట‌న‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశ భద్రతకు పెద్ద హెచ్చరికగా  ఆయన అభివర్ణించారు. ఈ ఘ‌ట‌న‌పై ఫైనల్ రిపోర్ట్ రానందున.. తాను దీనిపై మాట్లాడటం చాలా కష్టమన్నారు. అయితే తమిళనాడు లాంటి సేఫ్ జోన్‌లో మిలటరీ హెలికాప్టర్ పేలిన విషయం సాధారణ అంశం కాదని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున్న దర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.   

Read also: https://telugu.asianetnews.com/gallery/entertainment/rrr-trailer-gives-goosbumps-to-charan-and-ntr-fans-r3u1hd

ఈ ప్ర‌మాదంతో మన దేశ సమగ్రత ప్రశ్నార్ధకంలో ప‌డింద‌నీ,  మన దేశ అంతర్గత, బహిర్గత ముప్పుపై పార్లమెంటుతో పాటు కేంద్రం కూడా సమీక్ష చేసుకోవాలని స్వామి సూచించారు.  ఇప్పుడూ  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆయ‌న వీడియో నెట్టింట్లో వైర‌లవుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డ‌మేంట‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తోన్నారు. ప్ర‌స్తుతం స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడులోని ఊటీకి సమీపంలో బుధవారంనాడు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

click me!