కోవిడ్ శవాలను తీసుకెళ్లే వాహనాల ముందు ఫోటోలు.. వివాదంలో బీజేపీ ఎంపీ.. !

By AN TeluguFirst Published Apr 20, 2021, 4:59 PM IST
Highlights

కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా తయారవుతున్నారు నేతలు. దీంతో పుట్టుక నుంచి చావు దాకా దేన్నీ తమ ప్రచారం నుంచి మినహాయించడం లేదు. ఇది చాలాసార్లు విమర్శలకు దారితీస్తుంది.

కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టుగా తయారవుతున్నారు నేతలు. దీంతో పుట్టుక నుంచి చావు దాకా దేన్నీ తమ ప్రచారం నుంచి మినహాయించడం లేదు. ఇది చాలాసార్లు విమర్శలకు దారితీస్తుంది.

ఇలాంటి సంఘటనే ఇప్పుడొకటి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భోపాల్ కు చెందిన ఓ బీజేపీ నేత కరోనా మరణాలను కూడా తన ప్రచారానికి వాడుకుని వివాదాల్లో ఇరుక్కున్నాడు. 

కంటికి కనిపించని మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన ఒక బీజేపీ ఎంపీ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

వివరాల్లోకి వెడితే  భోపాల్‌ ఎంపీ, మాజీ మేయర్‌ అలోక్ శర్మ ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన కోవిడ్ తో చనిపోయిన వారిని స్మశానానికి తరలించే ముక్తి వాహనం ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చాడు. 

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ ఫొటోషూట్ వాహనాలను చాలా సేపు ఆపారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిమీద మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు నరేంద్ర సలుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడినందుకు సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా దీన్ని చూసిన నెటిజన్లు సైతం బీజేపీ ఎంపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

click me!