రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందన

By Nagaraju TFirst Published Sep 29, 2018, 4:44 PM IST
Highlights

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసంహారావు స్పందించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారు బీజేపీయేనని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నామని అలాంటిది టీఆర్‌ఎస్‌తో కలిసి రేవంత్‌పై ఎలా ఐటీ దాడులు చేయిస్తామని ప్రశ్నించారు. 


ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసంహారావు స్పందించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారు బీజేపీయేనని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నామని అలాంటిది టీఆర్‌ఎస్‌తో కలిసి రేవంత్‌పై ఎలా ఐటీ దాడులు చేయిస్తామని ప్రశ్నించారు. 

రాజకీయంగా తప్పించుకునేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైనా ఐటీ దాడులు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని జీవీఎల్ సూచించారు. 

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందని, ప్రకృతి సేద్యంలో నెంబర్ వన్‌ అంటూ ప్రచార అర్భాటం చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ప్రచార ఆర్భాటం, అవినీతి, అప్పు తెచ్చుకోవడంలో మాత్రమే నెంబర్ వన్ అంటూ ఎద్దేవా చేశారు. 

ప్రధాని మోదీ చరిష్మా, సహకారంతోనే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. వందల కోట్లు వృధా చేసి జీవోలను బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. జీవోలన్నింటిని ప్రభుత్వం బహిరంగ పరిచేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

అమరావతి బాండ్ల విషయంలో ఇన్వెస్టర్ల పేర్లు బయటపెట్టమంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తాను చేసే ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వ సొమ్ముతో దొంగ దీక్షలు చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు.

click me!