తమాషా మెుదలైందన్న రాహుల్....అంతకంటే ఏమీ ఆశించలేమన్న కేంద్రమంత్రి

By Nagaraju TFirst Published Sep 25, 2018, 3:41 PM IST
Highlights

 ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమాషా ఇప్పుడే మొదలైంది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.

ఢిల్లీ:  ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమాషా ఇప్పుడే మొదలైంది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. భారతదేశ చరిత్రలో ఒక ప్రధానిని ఉద్దేశించి ఏ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అబద్ధాల కోరు, బాధ్యతారహితుడైన రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం ఆ పార్టీకి సిగ్గుచేటన్నారు. బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్, వంటి స్కాంలలో కూరుకుపోయిన కుటుంబానికి చెందిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామన్నారు.  కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటో తొందర్లోనే భయటపెడతామని హెచ్చరించారు. 

 సోమవారం ఆమేథీలో పర్యటించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇప్పుడే తమాషా మొదలైందంటూ మోదీపై విమర్శలు గుప్పించారు. అవినీతిని అంతమొందిస్తానన్న మోదీ అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. 

రాబోయే రెండు,మూడు నెలల్లో రాఫెల్, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, పెద్ద నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ టాక్స్ వంటి విషయాల్లో మోదీ వ్యవహార తీరు బయటపెడతామని హెచ్చరించారు. తమాషా ఇప్పుడే మొదలైందని తెలిపారు. నరేంద్ర మోదీ కాపలాదారు కాదనీ, దొంగ అనే విషయాన్ని వెలుగులోకి తెస్తానని రాహుల్ అన్నారు. 

click me!
Last Updated Sep 25, 2018, 3:49 PM IST
click me!