బీజేపీ నేత కుష్బూ కారుకు ప్రమాదం: సురక్షితంగా బయటపడ్డ నేత

Published : Nov 18, 2020, 10:14 AM ISTUpdated : Nov 18, 2020, 10:27 AM IST
బీజేపీ నేత కుష్బూ కారుకు ప్రమాదం: సురక్షితంగా బయటపడ్డ నేత

సారాంశం

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ పెను ప్రమాదం నుండి బుధవారం నాడు తప్పించుకొంది. ఆమె ప్రయాణీస్తున్న కారు కంటైనర్ ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

చెన్నై: సినీ నటి, బీజేపీ నేత కుష్బూ పెను ప్రమాదం నుండి బుధవారం నాడు తప్పించుకొంది. ఆమె ప్రయాణీస్తున్న కారును కంటైనర్  ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

 

చెన్నైలోని మెల్మరువతుర్ సమీపంలో ఆమె ప్రయాణీస్తున్న కారును ట్యాంకర్ ఢీకొట్టింది.ఈ ప్రమాదం నుండి కుష్బూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.కడలూరులో  కుష్బూ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో కుష్బూ ప్రయాణీస్తున్న కారు ఓ వైపు పూర్తిగా దెబ్బతింది.

 

దెబ్బతిన్న కారు ఫోటోలను ట్విట్టర్ వేదికగా ఆమె పోస్టు చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కుష్బూ ప్రయాణీస్తున్న కారు బెలూన్లు వెంటనే తెరుచుకొన్నాయి. దీంతో కుష్బూ ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది.

 

అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయతో  తాను ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినట్టుగా కుష్బూ ప్రకటించారు.కడలూరుకు వెళ్తున్న సమయంలో ఓ కంటైనర్ లారీ వచ్చి తన కారును ఢీకొందని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 

ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?