ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

Published : Nov 18, 2020, 09:47 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

సారాంశం

టెంపో సూరత్‌ నుంచి పావగఢకు వెళ్తుండగా వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.   


గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటెయిన్‌, టెంపో ఢీకొన్న సంఘటనలో 10 మంది మృత్యువాత పడగా.. 17 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున వడోదర సమీపంలో చోటు చేసుకుంది. టెంపో సూరత్‌ నుంచి పావగఢకు వెళ్తుండగా వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. 

వేకువ జామున ఘటన జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?