BJP leader Eshwarappa: "మొఘలుల పాల‌న‌లో 36వేల హిందూ ఆలయాల ధ్వంసం" : బీజేపీ మాజీ మంత్రి

By Rajesh KFirst Published May 17, 2022, 5:31 AM IST
Highlights

BJP leader Eshwarappa:  దేశంపై మొఘలులు దాడి జరిపిన సమయంలో దాదాపు 36,000 దేవాలయాలు ధ్వంసం లేదా దెబ్బతిన్నాయని ముస్లిం నేతలు కూడా అంగీకరించారని బీజేపీ సీనియర్‌ నేత,  కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అన్ని ఆలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్ర‌క‌టించారు.  
 

BJP leader Eshwarappa: మొఘలుల పాల‌న స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా సుమారు 36 వేలకు పైగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని, వాటిని చట్టబద్ధంగా, ఎలాంటి ఘర్షణకు తావులేకుండా తిరిగి స్వాధీనం చేసుకుంటామని కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ప్రకటించారు. జ్ఞానవాపి మసీదు కూడా హిందూ ఆలయమేనని, ముస్లింలు స్వచ్ఛందంగా అప్పగించి ఉంటే ఎంతో బాగుండేదని అన్నారు. 

కర్ణాటక లో ఇస్లామిక్ పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించిన మసీదులో వారణాసిలోని జ్ఞానవాపి వివాదాస్పద కట్టడం ఆలయమని,  ప‌లు ఆధారాలు లభించడంతో హిందూ సంస్థలు ప్రార్థనలు చేసేందుకు అనుమతిని కోరాయి. విజయనగర సామ్రాజ్యంలోని శ్రీరంగపట్నం కోటలోని మస్జిద్ అల్-అలా అని కూడా పిలువబడే జామియా మసీదు హనుమాన్ దేవాలయమని ఈ సంస్థలు చెబుతున్నాయి. దాని గోడలు, స్తంభాలపై ప‌లు ఆధారాలు ఉన్న‌ట్లు హిందూ సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి.  

క‌ర్నాట‌క రాష్ట్రానికి 120 కిలోమీటర్ల దూరంలోని శ్రీరంగపట్నం కోటలో ఉన్న కోట ఆవరణలో ఉన్న చెరువులో పూజలు, స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మాండ్య జిల్లా యంత్రాంగానికి వినతి పత్రం అందజేసినట్లు విచార్ మంచ్ నాయకులు చెబుతున్నారు. రాజధాని బెంగళూరు విచార్ మంచ్ రాష్ట్ర కార్యదర్శి సిటి మంజునాథ్ మాట్లాడుతూ హనుమాన్ ఆలయాన్ని కూల్చివేసి ఈ మసీదు నిర్మించారన్నారని ఆరోపించారు. ఈ హనుమాన్ దేవాలయం పేరు ఆంజనేయ మందిరం అని సంస్థ వ్యక్తులు పేర్కొంటున్నారు. 

విజయనగర సామ్రాజ్యాన్ని ముస్లిం పాల‌కులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మసీదుగా మార్చాలని టిప్పు సుల్తాన్ పర్షియా రాజు ఖలీఫాకు లేఖ రాసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పత్రాలను పరిశీలించిన తర్వాత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ని దర్యాప్తు చేయాలని సంస్థకు చెందిన వ్యక్తులు కోరారు.  

అదే సమయంలో.. కాళీ మఠానికి చెందిన రిషి కుమార్ స్వామి అనే వ్యక్తి 1784 సంవత్సరంలో హనుమాన్ ఆలయాన్ని కూల్చివేసి టిప్పు సుల్తాన్ మసీదును నిర్మించాడని పేర్కొన్నారు. అందుకు రుజువు చేసేలా మసీదులో శాసనం ఉందన్నారు. మసీదు లోపల అప్పటి హోయసల సామ్రాజ్యానికి చిహ్నం ఉంద‌ని ఆరోపించారు. మసీదు కూల్చివేస్తామని బెదిరించినందుకు స్వామిని కూడా అరెస్టు చేశారు.  ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. పూజలకు అనుమతి కోరిన తరువాత.. మసీదు కమిటీ భద్రతను కోరింది. 

అనంత‌రం కర్ణాటక మాజీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప స్పందించారు. మసీదుకు ముందు ఆలయం ఉందని ముస్లిం నాయకులు కూడా అంగీకరించారని, మొఘల్ పాలనలో సుమారు 36,000 దేవాలయాలు ధ్వంసం లేదా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అన్ని ఆలయాలను తిరిగి పొందుతామని ఆయన చెప్పారు.

click me!