రాజస్థాన్‌లో దళిత యువతిపై యాసిడ్ దాడి, హత్య: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

Published : Jul 13, 2023, 08:37 PM IST
 రాజస్థాన్‌లో దళిత యువతిపై  యాసిడ్ దాడి, హత్య: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

సారాంశం

దళిత సామాజిక వర్గానికి చెందిన  19 ఏళ్ల యువతిపై  యాసిడ్ తో దాడి చేసి హత్య చేయడంపై  బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో  మహిళల రక్షణకు  ఈ ఘటన అద్దం పడుతుందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ విమర్శించారు

న్యూఢిల్లీ: దళిత సామాజిక వర్గానికి చెందిన  19 ఏళ్ల యువతిపై యాసిడ్ తో దాడి చేసి  హత్య చేశారు.  మృతదేహన్ని బావిలో వేశారు నిందితులు. ఈ ఘటన రాజస్థాన్ లో మహిళలు, బాలికల భద్రతకు అద్దం పడుతుందని  బీజేపీ విమర్శించింది.  

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్  ట్విట్టర్ వేదికగా ఈ విషయమై  కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ఈ ఘటన పట్ల ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం  చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు, దళితులకు ఏ రకమైన రక్షణ కల్పిస్తుందో  ఈ ఘటన అద్దం పడుతుందన్నారు.    ఈ విషయమై  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన  ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టే ఆమె మౌనంగా ఉన్నారా అని ఆయన అడిగారు.

 

ఈ ఏడాది జూన్ మాసంలో  కోచింగ్ సెంటర్ కు వెళ్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం  జరిగింది.అత్యాచారం చేసిన తర్వాత బాలికను హత్య చేశారు నిందితులు. రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ ఘటన చోటు  చేసుకుంది.  ఈ ఘటన జరిగిన  మూడు వారాలకే  దళిత యువతిపై యాసిడ్ తో దాడి చేసి హత్య చేయడం కలకలం రేపుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం