మమత అడ్డాలో వికసించిన కమలం: దీదీకి చెక్

By Nagaraju penumalaFirst Published May 19, 2019, 8:56 PM IST
Highlights

పశ్చిమబెంగాల్లో మెుత్తం 42 లోక్ సభ సీట్లకు గానూ బీజేపీ 19 నుంచి 23 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉందని సర్వేలో తేల్చి చెప్పింది. తృణమూల్  కాంగ్రెస్ కూడా 19 నుంచి 23 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. అంటే పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, బీజేపీల మధ్య పోరు నడిచిందని తెలుస్తోంది. 
 
కోల్‌కతా: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మింగుడుపడేలా కనిపించడం లేదు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సునామీ సృష్టించబోతుందని సర్వేలో వెల్లడిచింది. 

పశ్చిమబెంగాల్లో మెుత్తం 42 లోక్ సభ సీట్లకు గానూ బీజేపీ 19 నుంచి 23 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉందని సర్వేలో తేల్చి చెప్పింది. తృణమూల్  కాంగ్రెస్ కూడా 19 నుంచి 23 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. అంటే పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, బీజేపీల మధ్య పోరు నడిచిందని తెలుస్తోంది. 

నువ్వా నేనా అన్న రీతిలో పలితాలు ఉంటాయని సర్వేలో తెలిపింది. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగా ఈసారి ఏకంగా 23 వరకు గెలుచుకునే చాన్స్ ఉందని తెలిపింది. ఇకపోతే పశ్చిమబెంగాల్ పై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. 

మమతా బెనర్జీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో స్వయంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీలు రంగంలోకి దిగారు. పశ్చిమబెంగాల్ లో విపరీతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఎగ్జిట్ పోల్ ఫలితాలతో బీజేపీ నేతలు మంచి ఉత్సాహంతో ఉన్నారు. మే 23న విడుదలయ్యే ఫలితాలు వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తాయా లేక నిరుత్సాహానికి గురి చేస్తాయా అనేది వేచి చూడాలి.  

click me!