కర్ణాటకలో సీఎం మార్పు ఉండదు.. మరో రెండేళ్లు యడ్డీనే: తేల్చిచెప్పిన బీజేపీ కోర్ కమిటీ

By Siva KodatiFirst Published Jun 18, 2021, 6:56 PM IST
Highlights

కర్ణాటకలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. మరో రెండేళ్లు కూడా యడ్యూరప్పనే కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని కోర్ కమిటీ తెలిపింది. నాయకత్వంలో మార్పు అనే ఆలోచనే లేదని వెల్లడించింది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని బీజేపీ కోర్ కమిటీ హెచ్చరించింది. 

కర్ణాటకలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. మరో రెండేళ్లు కూడా యడ్యూరప్పనే కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని కోర్ కమిటీ తెలిపింది. నాయకత్వంలో మార్పు అనే ఆలోచనే లేదని వెల్లడించింది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని బీజేపీ కోర్ కమిటీ హెచ్చరించింది. 

కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మంత్రి వర్గ సహచారులు, ఇతర పెద్దల మధ్య సఖ్యత కుదర్చలేకపోతున్నారు. ఇవన్నీ అంతిమంగా ఆయన కుర్చీకి ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తరువాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నో ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తూ, కష్టాల్లోనూ విడిచిపెట్టుకుండా ఉన్నవారిని కాదని వలసవాదులకు పదవులు కట్టబెట్టారంటూ అసంతృప్త నేతలు విమర్శిస్తున్నారు.

Also Read:విందు రాజకీయం: యడ్డీకి పాతిక మంది ఎమ్మెల్యే షాక్, కుర్చీకీ ఎసరేనా..?

దీనిని గమనించిన యడియూరప్ప అసంతృప్తిని చల్లార్చేందుకు విందు రాజకీయం చేశారు. గతకొంత కాలంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి ఆయన మంత్రిపదవులు కట్టబెట్టారు. అయితే యడ్డీ నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. 

అయితే, సీఎం మార్పు విషయంపై ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన అరుణ్‌సింగ్‌.. కర్ణాటకలో సీఎం మార్పును కొట్టిపారేశారు. యడియూరప్ప పనితీరు బేషుగ్గా ఉందని, కొవిడ్‌-19ను సమర్ధంగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. యడియూరప్ప పనితీరుపై అధిష్ఠానం సంతృప్తి ఉందని, సీఎం మార్పు లేదని స్పష్టం చేశారు. ఆయనే పూర్తికాలం సీఎంగా ఉంటారని వివరించారు

click me!