లోకసభ ఎన్నికలకు బిజెపి ఇంచార్జీలు: ఎపికి మురళి, తెలంగాణకు అరవింద్

By Arun Kumar PFirst Published Dec 26, 2018, 5:20 PM IST
Highlights

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బిజెపి పార్టీకి ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అప్రమత్తమైన పార్టీ అదాష్టానం ముందస్తుగానే అప్రమత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయాన్ని కుదుర్చడం కోసం అదిష్టానం తాజాగా ఇంచార్జీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజెపి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కూడా కొత్త ఇంచార్జీలను నియమించారు. ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ వ్యవహారాలను చూసుకునే బాధ్యతను మురళీధర్ రావు, సునీల్ దేవదార్ లకు అప్పగించారు. అలాగే తెలంగాణ ఇంచార్జీగా కర్ణాటక బిజెపి సీనియర్ నాయకులు అరవింద్ లింబవలిని నియమిస్తూ బిజెపి అదిష్టానం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

బిజెపి అధ్యక్షులు అమిత్ షా పేరిట మరికొన్ని రాష్ట్రాలకు కూడా బిజెపి ఇంచార్జిలను నియామకంపై ఓ ప్రకటన వెలువడింది. అందులో ఏయే రాష్ట్రాల భాద్యతలు ఎవరికి అప్పగించారన్నది ఓ జాబితా రూపంలో విడుదల చేశారు. 

వివిధ రాష్ట్రాల ఇంచార్జిల జాబితా:

1. ఆంధ్ర ప్రదేశ్ : మురళీధర్ రావు, సునీల్ దేవదార్

2. అస్సాం : మహేద్ర సింహ్

3. బీహార్ : భూపేంద్ర యాదవ్ 

4. చత్తీస్ గడ్ : సునీల్ జైన్

5. గుజరాత్ : ఓంప్రకాశ్ మాథుర్

6. హిమాచల్ ప్రదేశ్ : తీరత్ సింగ్ రావత్ 

7. ఝార్ఖండ్ : మంగల్ పాండే 

8. మధ్య ప్రదేశ్ ; స్వతంత్ దేవ్ సింగ్, సతీష్ ఉపాధ్యాయ

9. మణిపూర్ : నలిన్ కోహ్లీ

10. నాగాలాండ్ : నలిన్ కోహ్లీ

11. ఒడిషా : అరుష్ సింగ్ 

12. పంజాబ్ : కెప్టెన్ అభిమన్యు

13. రాజస్థాన్ : ప్రకాశ్ జవదేకర్, సుధాంశు త్రివేది

14. సిక్కిం : నితిన్ నవీన్

15. తెలంగాణ : అరవింద్ లింబావలి

16. ఉత్తరాఖండ్ : థ్యావర్ చంద్ గెహ్లాట్ 

17. ఉత్తర ప్రదేశ్ : గోవర్ధన్ జడపియా, దుష్యంత్ గౌతమ్, నరోత్తమ్ మిశ్రా

18. చండీఘడ్ : కెప్టెన్ అభిమన్యు

click me!