కోరిక తీర్చమన్నాడని.. పురుషాంగం కోసేసింది

Published : Dec 26, 2018, 04:40 PM IST
కోరిక తీర్చమన్నాడని.. పురుషాంగం కోసేసింది

సారాంశం

అతని కోరిక తీర్చడానికి అంగీకరించినట్లు నటించి.. ఓ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ పథకం ప్రకారం.. ఇద్దరు యువకుల సహాయంతో.. తుషార్ పురుషాంగాన్ని కోసేసింది. 

లైంగికంగా వేధిస్తున్నాడని..ఓ మహిళ వ్యక్తి పురుషాంగాన్ని కోసేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని డోంబివిలీలో చోటుచేసుకుంది. కాగా.. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. డోంబివిలీ ప్రాంతానికి చెందిన తుషార్ పుజారా(27) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. కావాలనే అసభ్యంగా తాకుతూ హింసిస్తున్నాడు. అతని వేధింపులు రోజు రోజుకీ పెరిగపోతుండటంతో... యువతి సహించలేకపోయింది.

దీంతో.. అతని కోరిక తీర్చడానికి అంగీకరించినట్లు నటించి.. ఓ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ పథకం ప్రకారం.. ఇద్దరు యువకుల సహాయంతో.. తుషార్ పురుషాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతనిని ఆమె స్వయంగా ఆస్పత్రిలో చేర్పించడం గమనార్హం.

కాగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని, ఆమెకు సహకరించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

మెల్‌బోర్న్‌ లో మోదీ క్రేజ్ చూసి ఆస్ట్రేలియా ప్రధాని షాక్ | PM Modi in Australia: Melbourne
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia