ఎన్నికల వేళ... బీజేపీ కార్యకర్త దారుణహత్య

sivanagaprasad kodati |  
Published : Nov 04, 2018, 01:33 PM IST
ఎన్నికల వేళ... బీజేపీ కార్యకర్త దారుణహత్య

సారాంశం

ఎన్నికల వేళ బీజేపీకి చెందిన కీలక కార్యకర్త హత్య రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త సామ్రాట్ కుమావత్ శనివారం రోడ్డు పక్కన నిల్చుని ఉన్నాడు

ఎన్నికల వేళ బీజేపీకి చెందిన కీలక కార్యకర్త హత్య రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త సామ్రాట్ కుమావత్ శనివారం రోడ్డు పక్కన నిల్చుని ఉన్నాడు.

ఈ క్రమంలో బైకులపై వచ్చిన నలుగురు దుండగులు అందరూ చూస్తుండగానే కుమావత్‌పై కాల్పులు జరిపి... అనంతరం కత్తితో గొంతు కోశారు.. తీవ్ర రక్తస్రావం కావడంతో సామ్రాట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికులు స్పందించి హంతకుల్ని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కుమావత్ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..