దారుణం: అద్దెకు అందమైన భార్యలు, ఆచారం పేరుతో అనాగరికం

First Published Jul 2, 2018, 10:10 AM IST
Highlights

అద్దెకు అందమైన భార్యలు

భోపాల్: దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు రకాలైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారంగా తన భార్యను ఇతర వ్యక్తులకు భర్త విక్రయించుకొనే వెసులు బాటు ఉంది. స్టాంపు పేపర్‌పై ఇరు వర్గాల మధ్య  ఒప్పందం కుదుర్చుకొంటే సరిపోతోంది. ఈ ఒప్పందంలో భార్యను విక్రయించిన భర్తకు ఎంత ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అంత ఎక్కువ కాలం కొనుగోలుదారుడి వద్ద ఉంచుకొనే వెసులుబాటు ఉంటుంది.

రూ.10 లేదా రూ.100 స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు ఒప్పందం రాసుకొని సంతకాలు చేసి డబ్బులు ఇస్తే  సరిపోతోంది. తమ భార్యను ఇతరులకు ఇచ్చే వెసులుబాటు ఉంది.ఈ ఒప్పంద కాలం పూర్తయ్యాక భార్యను అతను మరో వ్యక్తికి విక్రయించేందుకు బేరం పెట్టుకొనే అవకాశం ఉంటుంది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ఈ దారుణమైన ఆచారం కొనసాగుతోంది.

గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకు రూ. 8000లకు  అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలను కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. 

అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. 

డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ఎవరూ కూడ ముందుకు రారు. సంప్రదాయాలు ఆచారాల పేరుతో ఈ రకమైన దారుణమైన ఆచార వ్యవహరాలను సాగిస్తున్నారు. దీంతో పోలీసులు కూడ ఏం చేయలేకపోతున్నారు.

click me!