రాజ్‌ఠాక్రే బర్త్‌డే:‌ లీటర్ పెట్రోల్‌పై రూ. 9 తగ్గింపు

Published : Jun 14, 2018, 01:25 PM IST
రాజ్‌ఠాక్రే బర్త్‌డే:‌ లీటర్ పెట్రోల్‌పై రూ. 9 తగ్గింపు

సారాంశం

ముంబై వాసులకు బంపర్ ఆఫరిచ్చిన  రాజ్ ఠాక్రే


ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్‌ ఠాక్రే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని  ముంబై వాసులకు రాజ్ ఠాక్రే బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. గురువారం నాడు ఎంపిక చేసిన  పెట్రోల్ బంకుల్లో  రూ. 9 తక్కువధరకే ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ ను విక్రయిస్తున్నారు.

మహారాష్ట్రలోని 48 పెట్రోల్ బంకుల్లో  లీటర్ పెట్రోల్ ధరను రూ.9 తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నవ నిర్మాణ సేన చీఫ్  రాజ్ ఠాక్రే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.  పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన తరుణంలో ప్రజలకు నవ నిర్మాణ సేన ఈ ఆఫర్ ను ప్రకటించింది. 

ముంబైలో 36 పెట్రోల్ స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో  12 చోట్ల ఈ అవకాశం కల్పించింది. అయితే, ఈ తగ్గింపు కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం చేసింది. లీటర్ కు రూ. 9 తగ్గించి వాహనదారులకు పెట్రోల్  విక్రయాలు జరపడం వల్ల  ఈ రోజు ఒక్కో బంక్ కు వచ్చే నష్టాన్ని నవ నిర్మాణ సేన చెల్లించనుంది.

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్