
Bird flu scare: మానవళిని నిత్యం ఏదోక వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది. దాదాపు రెండున్నరేండ్ల కరాళ నృత్యం చేసిన మహమ్మారి కాస్త శాంతించింది. కేసుల సంఖ్య దాదాపు తగ్గుముఖం పట్టాయి. అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఓ సారిగా ఆలజడి రేగింది. చాపకింద నీరులా మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. థానే జిల్లాలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో దాదాపు 100 కోళ్లు హఠాత్తుగా మృతి చెండటంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోళ్లను చంపాలని నిర్ణయించింది. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. థానే జిల్లా షాహాపూర్ తహసీల్ మండలంలోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ కోళ్లఫారంలో వందలాది కోళ్లు ఆకస్మికంగా మృతిచెందాయి. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. కోళ్ల మరణానికి బర్డ్ ఫ్లూ నే కారణమని తెలింది.
దీంతో అప్రమత్తమైన థానే జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ లు.. ముందుజాగ్రత్త చర్యగా, ప్రభావితమైన పౌల్ట్రీ ఫారమ్ నుండి కిలోమీటరు పరిధిలో సుమారు 25,000 కోళ్లను చంపేయాలని అధికారులకు సూచించారు. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖను ఆదేశించినట్లు థానే డిఎం తెలిపారు.
థానే జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డాక్టర్ భౌసాహెబ్ దంగ్డే కూడా H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా కోళ్లు చనిపోయాయని ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ కేసుల గుర్తింపుపై జిల్లా అధికారులు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు అధికారులు.
బర్డ్ ఫ్లూ.. శాస్త్రీయ నామం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా, ఇది పక్షులలో కనిపించే ఓ అంటు వ్యాధి, ఎక్కువగా బాతులు, కోళ్లు పక్షులలో.. ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వ్యాప్తి అడవి పక్షుల ద్వారా వ్యాపిస్తుందని, ఈకలు లేదా మలం ద్వారా పౌల్ట్రీకి వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.