Bill Gates Resume: 48 ఏళ్ల కిత్రం రెజ్యూమ్ ను షేర్ చేసిన బిల్ గేట్స్.. అత‌ని అర్హ‌త‌లేంటో తెలుసా? 

By Rajesh KFirst Published Jul 5, 2022, 3:47 AM IST
Highlights

Bill Gates Resume: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన 48 ఏళ్ల రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు, నేటి యువత రెజ్యూమ్ స్పష్టంగా దాని కంటే మెరుగ్గా ఉంటుందని రాశారు. బిల్ గేట్స్ త‌న రెజ్యూమ్ ను లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేశారు. వైర‌ల్ గా మారింది.

Bill Gates Resume: మైక్రోసాఫ్ట్  స‌హా వ్య‌వస్థాప‌కుడు, ప్రపంచంలో నాల్గవ అత్యంత ధనవంతుడు అయిన బిల్ గేట్స్.  48 సంవత్సరాల క్రితం తన రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐదు దశాబ్దాల క్రితం ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు.. ఆయ‌న‌ ఇదే రెజ్యూమ్‌ను ఉపయోగించాడు. 

వాస్తవానికి, బిల్ గేట్స్ తన రెజ్యూమ్‌ను ప్రొఫెషనల్ సోషల్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. అతని రెజ్యూమ్‌ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేయగానే లక్షల్లో రియాక్షన్స్ వస్తున్నాయి. లింక్డ్ఇన్ అనేది మైక్రోసాఫ్ట్ యొక్క సామాజిక వేదిక. లింక్డ్‌ఇన్‌లో.. ప్రతి వృత్తికి సంబంధించిన వ్యక్తులు, కంపెనీలు తమ పని, నైపుణ్యాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగం ఇచ్చి సంపాదించుకునే వెసులుబాటు ఉంది.

బిల్ గేట్స్ షేర్ చేసిన రెజ్యూమెలో.. ఆయ‌న‌ పేరు విలియం హెచ్‌ గేట్స్‌గా పేర్కొన‌బ‌డింది. ఆయ‌న  హార్వర్డ్ కాలేజీలో తొలి సంవత్సరం చదువుతున్నట్టు చెప్పారు. చిన్నప్పటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టప‌డే బిల్ గేట్స్. కంప్యూటర్, సాంకేతికతపై దృష్టి పెట్టాడు. బిల్ గేట్స్ రెజ్యూమ్ చూస్తుంటే  గెస్ట్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ మొదలైన కోర్సుల్లో ఉందని వివరించారు. 1973లో టీఆర్‌డబ్ల్యూ సిస్టమ్స్ గ్రూప్‌లో సిస్టమ్ ప్రొగ్రామర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నట్టు తెలిపారు. ఇలా తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను బిల్ గేట్స్ పంచుకున్నారు.

బిల్ గేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన రెజ్యూమ్‌పై వేలాది మంది నిరంతరం కామెంట్స్ చేస్తున్నారు.  ఏ వ్యక్తి అయినా.. తన పాత రెజ్యూమ్‌ను తప్పనిసరిగా భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌నీ, తద్వారా భవిష్యత్తులో.. త‌న జీవితంలో ఎంత‌ ముందుకు సాగారో తెలుసుకోవ‌చ్చు. జీవితంలో చేసిన వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ఉప‌యోగప‌డుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

బిల్ గేట్స్ రెజ్యూమ్ చాలా గొప్పదని మ‌రో నెటిజ‌న్  అభివర్ణించారు. అదే సమయంలో.. ఇది 48 ఏళ్ల నాటి రెజ్యూమ్ చాలా బాగుంది, త‌న గొప్ప రెజ్యూమ్‌ను పంచుకున్నందుకు బిల్ గేట్స్ కు ధన్యవాదాలు. మనమందరం మన రెజ్యూమ్‌ కాపీలను ద‌గ్గ‌ర‌ ఉంచుకోవాలి. తద్వారా మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డామో..  జీవితంలో ఎంత సాధించామో.. వాటిని గుర్తుకు తెచ్చుకోవ‌చ్చ‌ని మరొక నెటిజ‌న్ వ్రాశారు.
 

click me!