Bill Gates praises India: ఆ విష‌యంలో ప్రపంచ దేశాలు భార‌త్ ను చూసి పాఠాలు నేర్చుకోవాలి: బిల్ గేట్స్

Published : May 29, 2022, 04:18 PM IST
Bill Gates praises India: ఆ విష‌యంలో ప్రపంచ దేశాలు భార‌త్ ను చూసి పాఠాలు నేర్చుకోవాలి: బిల్ గేట్స్

సారాంశం

Bill Gates praises India: క‌రోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో భారతదేశం విజయం సాధించింద‌నీ, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్ర‌శంసించారు. భార‌త్ ను చూసి ప్ర‌పంచ దేశాలు పాఠాలు నేర్చుకోవాల‌ని కొనియాడారు.    

Bill Gates praises India: క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్యక్రమాన్ని భార‌త్ విజయవంతంగా సాగిస్తోంద‌ని మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రశంసించారు. ఈ మేర‌కు ఆరోగ్య రంగంలో సత్ఫలితాలు సాధించడం కోసం సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రశంసించారు. ఈ విష‌యంలో ప్రపంచ దేశాలు భార‌త్ ను చూసి పాఠాలు నేర్చుకోవాలని కూడా బిల్ గేట్స్ సూచించారు

  
ఈ వారం (మే 25న‌) ప్రారంభంలో కేంద్ర‌ ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ దావోస్‌#WEF22లో బిల్ గేట్స్(BillGates)తో కలిసిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ  ట్వీట్‌లో.. బిల్ గేట్స్‌తో మాట్లాడటం త‌నకు  చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 నిర్వహణ, భారీ స్థాయిలో నిర్వహించిన  వ్యాక్సీనేష‌న్ కార్యక్రమాలను  భారతదేశం సాధించిన విజయాన్ని ప్ర‌శంసించారని తెలిపారు. అలాగే  mRNA ప్రాంతీయ కేంద్రాల సృష్టితో పాటు సరసమైన, నాణ్యమైన రోగనిర్ధారణ, వైద్య పరికరాల అభివృద్ధిని బలోపేతం చేయడాన్ని మెచ్చుకున్నార‌ని తెలిపారు. 

మాండవ్య ట్వీట్‌లపై బిల్ గేట్స్ శనివారం స్పందిస్తూ..  మన్సుఖ్ మాండవియాను కలుసుకుని, ప్రపంచ ఆరోగ్య రంగంపై అభిప్రాయాలను పంచుకోవడం చాలా సంతోషకరమ‌నీ, ప్రపంచ ఆరోగ్యంపై దృక్కోణాలను మార్పిడి చేసుకోవడం గొప్ప విషయమ‌నీ, వ్యాక్సీనేష‌న్ విష‌యంతో భారతదేశం సాధించిన విజయం నుండి ప్రపంచం నేర్చుకోవలసిన అనేక పాఠాలు ఉన్నాయని, ఆరోగ్య ఫలితాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతికతను ఉపయోగించ‌డాని ప్రశంసించారు. 

మాండవీయ ఇచ్చిన మరొక ట్వీట్‌లో.. ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. డిజిటల్ హెల్త్, వ్యాధుల నియంత్రణ నిర్వహణ, mRNA ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు, అందరికీ అందుబాటులో ఉండే, నాణ్యమైన డయాగ్నొస్టిక్స్, మెడికల్ డివైసెస్ అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.  

భారత్‌ గతేడాది జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు.. దాదాపు 88 శాతం మంది సంపూర్ణంగా  వ్యాక్సినేష‌న్ చేయించుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనివారం వెల్లడించారు. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ కోసం దేశం ఎక్కువగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కోవిషీల్డ్, స్వదేశంలో అభివృద్ధిపరచిన కోవాగ్జిన్ టీకాలను భారత్  అత్యధికంగా ఉపయోగించింది. ఇంతలో, బిల్ గేట్స్ యొక్క బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ 2003 నుండి భారతదేశంలో పని చేస్తోంది. వారి అధికారిక వెబ్‌సైట్‌ల ప్రకారం..  ఫౌండేషన్ యునైటెడ్ స్టేట్స్ కాకుండా ఇతర దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ పెట్టుబడి పెట్టింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు