లక్కంటే ఇదే.. వేగంగా వస్తున్న ట్రక్‌ను ఢీకొనబోయాడు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.. వైరల్ వీడియో ఇదే

By Mahesh KFirst Published Jan 7, 2023, 5:02 PM IST
Highlights

ఓ బైక్ రైడర్ నిర్లక్ష్యంగా ఎటూ చూడకుండానే రోడ్డు క్రాస్ చేయబోయాడు. అప్పుడే అటువైపుగా పెద్ద ట్రక్ వచ్చింది. దాదాపు అవి రెండు ఢీకొట్టుకునే దశలో ట్రక్ డ్రైవర్ దూరంగా వాహనాన్ని తీసుకెళ్లాడు. బైక్ రైడర్ యూ టర్న్ తీశాడు. దీంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
 

న్యూఢిల్లీ: రెప్పపాటులో ప్రమాదాలు జరిగిపోతాయి. ప్రతి రోడ్డు ప్రమాదంలో క్షణకాలంలో జరిగే పొరపాటు.. లేదా ప్రమాదాన్ని అంచనా వేయడంలో పొరపాటులు కనిపిస్తాయి. రోడ్డు ఎక్కితే.. మనతోపాటు ఎదుటి వారూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా నడిపితేనే ఉభయకుశలోపరి. లేదంటే ఇంటికి చేరుతామా? లేదా? అనే సంశయంతోనే ప్రయాణం జరుగుతుంది. ఒకరి కేర్‌లెస్ డ్రైవింగ్ మరొకరికి ప్రాణ సంకటంగా మారొచ్చు. ఇలాగే ఓ వ్యక్తి బైక్ పై వేగంగా కేర్‌లెస్‌గా రోడ్డు క్రాస్ చేయడానికి వెళ్లాడు. రోడ్డు మధ్యవరకు వెళ్లిన తర్వాత గానీ అదే రోడ్డు మీద వస్తున్న ట్రక్‌ను చూడలేదు. హఠాత్తుగా బైక్ కనిపించడంతో ఆ ట్రక్ డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. వాహనాన్ని పక్కకు పోనిచ్చాడు. అప్పుడు ఆ డ్రైవర్ కూడా అప్రమత్తమై నడి రోడ్డుపై యూ టర్న్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐపీఎస్ అధికారి దిపాన్షు కాబ్రా ఈ వీడియోను ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదాలే జరగని స్థాయిలో వాహన వేగాన్ని మెయింటెయిన్ చేసుకోవాలని సూచనలు చేశారు. తద్వారా మీతోపాటు ఇతరులూ సురక్షితంగా ఉండగలుగుతారని క్యాప్షన్ జోడించారు.

ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వేగంగా రోడ్డు క్రాస్ చేయడానికి వచ్చాడు. అదే సమయంలో పెద్ద ట్రక్ అక్కడి నుంచి వెళ్లుతున్నది. దాదాపు అవి రెండు ఢీకొట్టుకోవడం ఖాయంగా తోచింది. కానీ, ఆ బైక్ రైడర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు ప్రమాదపుటంచులకు వెళ్లి బయటకువచ్చాడు.

Also Read: రేణుక ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. బొలెరో రూపంలో మృత్యువు.. ఆరుగురు దుర్మరణం..

ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలను ఆయన పేర్కొనలేదు. అయితే, ఈ వీడియోను గురువారం వీడియో పోస్టు చేశారు. అప్పటి నుంచి ఈ వీడియోను 81 వేలకు మించి నెటిజన్లు వీక్షించారు. సుమారు 700 మంది లైక్‌లు కొట్టారు. ఈ పోస్టుపై నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 

ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय,
औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD

— Dipanshu Kabra (@ipskabra)

‘ఇది కచ్చితంగా ఆ టూ వీలర్ డ్రైవర్‌దే తప్పు. మెయిన్ క్యారేజ్ వే పై వెహికిల్స్ వస్తున్నాయా? లేదా? అని ఆగి చూసి ప్రొసీడ్ కావాల్సిన బాధ్యత బైక్ రైడర్ పైనే ఉంటుంది’ అని ఓ యూజర్ వివరించారు. మరొకరు డ్రైవింగ్ చేయడానికి లీగల్ ఏజ్ కచ్చితంగా 25 ఏళ్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. తద్వారా కుటుంబం విలువ, సమాజం విలువ వారు స్వతహాగా తెలుసుకునేవారికే డ్రైవింగ్ అనుమతించడం మంచిదని పేర్కొన్నాడు.

click me!