ఏడుపు ఆపడం లేదని.. కొడుకు పెదాలను ఫెవీక్విక్‌తో..!!

Siva Kodati |  
Published : Mar 24, 2019, 12:59 PM IST
ఏడుపు ఆపడం లేదని.. కొడుకు పెదాలను ఫెవీక్విక్‌తో..!!

సారాంశం

బీహార్‌లో దారుణం జరిగింది. తన కొడుకు ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి చిన్నారి పెదాలను ఫెవీక్విక్‌తో అంటించేసింది. 

బీహార్‌లో దారుణం జరిగింది. తన కొడుకు ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి చిన్నారి పెదాలను ఫెవీక్విక్‌తో అంటించేసింది. వివరాల్లోకి వెళితే.. చాహాప్రాకు చెందిన శోభ తన కొడుకు ఏడుస్తుండటంతో అతనిని సముదాయించేందుకు ప్రయత్నించింది.

అయితే చిన్నారి ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో ఆమెకు సహనం నశించింది. దీంతో కొడుకు నోరు మూయిస్తే కానీ వాడు ఏడుపు ఆపడని భావించింది. అంతే ఫెవీక్విక్‌తో అతని పెదాలకు రాసింది.

అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన పిల్లాడి తండ్రికి బాబు ఏడుపు వినిపించకపోవడంతో అనుమానం వచ్చింది. బాబు దగ్గరికి వెళ్లి చూడగా అతని నోటి నుంచి నురుగు వస్తోంది. తీవ్ర ఆందోళనకు గురైన అతను భార్య శోభను పిలిచి ఏం జరిగిందని అడిగాడు.

ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో కొడుకు నోరు మూయించేందుకు ఫెవిక్విక్ రాసినట్లు భార్య చెప్పడంతో అతను నిర్ఘాంతపోయాడు.  హుటాహుటిన కొడుకును తీసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు చిన్నారి పెదాలకు అంటిన గమ్‌ను తొలగించడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం