‘‘నా కొడుకు నరబలికి అనుమతి ఇవ్వండి’’

Published : Feb 02, 2019, 12:20 PM IST
‘‘నా కొడుకు నరబలికి అనుమతి ఇవ్వండి’’

సారాంశం

తన కొడుకును తాను నరబలి ఇవ్వాలనుకుంటున్నానని.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మాంత్రికుడు ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించాడు.


తన కొడుకును తాను నరబలి ఇవ్వాలనుకుంటున్నానని.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మాంత్రికుడు ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది. కాగా.. ఆ వినతి పత్రం చూసి విస్తుపోవడం అధికారుల వంతు అయ్యింది.
 
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ లోని బెగుసరాయి జిల్లా మోహన్ పూర్-పహాడ్ ఫూర్ గ్రామ వాసి సురేంద్ర ప్రాసద్ సింగ్.. తాంత్రిక పూజలు నిర్వహిస్తూ ఉంటాడు. కాగా.. అతనికి ఇంజినీరింగ్ చదివే కుమారుడు ఉన్నాడు. కాగా.. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు తన కొడుకు బలి ఇవ్వాలనుకున్నాడు. ఇందుకు అనుమతి కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. 

తన ఆరాధ్య దేవత గుడి నిర్మాణానికి కొడుకు నిరాకరించాడని.. అందుకే తాను కొడుకును నరబలి ఇవ్వాలనుకున్నట్లు అతను చెప్పడం విశేషం. తనకు ఇదే మొదటి నరబలి అని అతను చెప్పాడు. నరిబలి నేరం కాదని తెలిపాడు. తన కొడుకు రావణాసురుడు లాంటివాడని అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నానని అతను చెప్పాడు. 

కాగా.. ఈ సంఘటన వైరల్ గా మారింది. దీంతో.. తాంత్రికుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..