ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Published : Feb 02, 2019, 08:54 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాంచిపురం సెయ్యరు సమీపంలో లారీ, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 31మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు గుర్తించారు. కాంచీపురంలో ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా  ఈఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ అతివేగంగా వచ్చి వ్యాన్‌ను ఢికొట్టడంతో వ్యాన్‌ నుజ్జునుజ్జయింది. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..