ఐదేళ్ల చిన్నారిపై అమానుషం.. కిడ్నాప్, అత్యాచారం,  ఆపై..

Published : Jul 30, 2023, 06:16 AM IST
ఐదేళ్ల చిన్నారిపై అమానుషం.. కిడ్నాప్, అత్యాచారం,  ఆపై..

సారాంశం

ఐదేళ్ల చిన్నారి అపహరించిన ఓ కామాంధుడు.. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ ఉదంతం కేరళలో శుక్రవారం వెలుగు చూసింది. ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఐదేళ్ల చిన్నారి అపహరించిన ఓ కామాంధుడు.. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ ఉదంతం కేరళలో శుక్రవారం వెలుగు చూసింది. ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలికను హత్య చేసిన తర్వాత నిందితులు ఆమెను గోనె సంచిలో కట్టి మార్కెట్ సమీపంలో ఉంచారు. సుమారు 20 గంటల తర్వాత క్లీనింగ్ వర్కర్ శుభ్రం చేస్తుండగా గోనె సంచి దగ్గరకు చేరుకుని దుర్వాసన రావడంతో వెలుగులోకి వచ్చింది. 

అందిన సమాచారం ప్రకారం..  కేరళలోని అలువా మార్కెట్ సమీపంలో గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక మృతదేహాన్ని చూసిన క్లీనింగ్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చూస్తుంటే హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు అనిపించింది.

ఒకరి  అరెస్ట్, మరోకరి  పరారీ
 
బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే, పోలీసులు నిందితులను గుర్తించడం ప్రారంభిస్తారు. త్వరితగతిన చర్యలు తీసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని కూడా పోస్టుమార్టంకు తరలించారు. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఉన్నట్లు చెబుతున్నారు. బాలికపై తొలుత అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్టుమార్టం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక బీహార్ వాసి. ఆ చిన్నారిని అస్ఫాక్ ఆలం అనే వ్యక్తి చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు అస్ఫాక్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి విచారించగా, బాలికను జాకీర్ అనే వ్యక్తికి అప్పగించినట్లు ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మానవ అక్రమ రవాణాకు సంబంధించినదని, ఆడపిల్లను అమ్మేందుకే ఇలాంటి కుంభకోణం జరిగి ఉంటుందని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు

బాలిక తల్లిదండ్రులు గత ఐదేళ్లుగా అలువాలోని తాయకట్టుకరలో నివసిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం బాలిక అపహరణకు గురైంది. నిందితుడు మొహమ్మద్ అస్ఫాక్ ఆలం  జ్యూస్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను తన వెంట తీసుకెళ్లాడు.ఆ తర్వాత బాలికను జాకీర్ అనే వ్యక్తికి అప్పగించాడు. ప్రస్తుతం జకీర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?