విషాదంగా మారిన 'మోమోస్ ఛాలెంజ్'.. హడావిడిగా ఎక్కువ మోమోస్ తిన్న వ్యక్తి మృతి..

Published : Jul 16, 2023, 05:29 AM ISTUpdated : Jul 16, 2023, 07:28 AM IST
 విషాదంగా మారిన 'మోమోస్ ఛాలెంజ్'.. హడావిడిగా ఎక్కువ మోమోస్ తిన్న వ్యక్తి మృతి..

సారాంశం

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో స్నేహపూర్వక వేసుకున్న ఛాలెంజ్‌లో ఒకరు మరణించడంతో ప్రాణాంతకంగా మారింది. 25 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో మోమోస్ తినే ఛాలెంజ్‌లో ఎక్కువ మొత్తంలో మోమోస్ తిన్న తర్వాత మరణించాడు. మరణం తరువాత మృతుడి తండ్రి అతని స్నేహితులు  కుట్ర చేశారని ఆరోపించారు.  

మోమోస్ అంటే చాలా మంది  ఇష్టపడుతుంటారు. ఈ రోజుల్లో చాలా మంది యువతకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ జాబితాలో మోమోలు ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. అయితే.. తాజాగా కొంతమంది  స్నేహితులు పెట్టుకున్న మోమోలు తినే ఛాలెంజ్ విషాదంగా మారింది. ఎక్కువ మోమోలు తిన్న వ్యక్తి .. అస్వస్థతకు గురై  ప్రాణాలు కోల్పోయాడు. సరదా చేసిన ఘటన ఇలా విషాదంగా మారింది.  ఈ ఘటన సివాన్ జిల్లాలోని బదిహరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి చోటుచేసుకుంది. ఇది విని మోమోస్ ప్రేమికులు షాక్ అవుతున్నారు. 

వివరాల్లోకెళ్తే..   సివాన్ జిల్లాలోని బదిహరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మొబైల్ రిపేర్ షాపులో బిపిన్ కుమార్ పాశ్వాన్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే తన దుకాణానికి  పాశ్వాన్ వెళ్లాడు. అయితే.. తన స్నేహితులు కలువడంతో పాశ్వాన్ సరదాగా మాట్లాడుకుంటూ తిందామని ఓ పాస్ట్ పుడ్ సెంటర్ కు వెళ్లారు. ఈ సమయంలో స్నేహితులందరూ కలిసి ఓ ఛాలెంజ్ వేసుకున్నారు. అదే మోమోస్ ఛాలెంజ్.. ఎవరు ఎక్కువ మోమోస్ తింటారో అంటూ. . ఒకరినొకరు సవాలు చేసుకున్నారు. పాశ్వాన్ కూడా తన స్నేహితులు విసిరిన సవాలు ను అంగీకరించాడు. 

 ఛాలెంజ్‌ భాగంగా బిపిన్ పాశ్వాన్ ఏకంగా 150 మోమోలు తిన్నాడని తెలుస్తోంది. అయితే.. ఏకంగా కాలంలో అన్ని మోమోస్ తినేసరికి అస్వస్థతకు గురయ్యాడు. పాశ్వాన్ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాశ్వాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

బిపిన్ స్నేహితులే అతన్ని హత్య చేశారని తండ్రి ఆరోపించాడు. వారు ఉద్దేశపూర్వకంగా మోమోస్ తినే ఛాలెంజ్‌ని విసిరారని, ఈ చర్యలో తన కుమారుడికి విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. మృతిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. వైద్య నివేదిక కోసం వేచి ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు పాశ్వాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పాశ్వాన్ ఆకస్మిక మరణంతో కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. ఈ ఘటన ఆ ప్రాంతంలోనూ కలకలం రేపింది.

మోమోస్‌ని నమిలి తినాలి

మొమోస్ పూర్తిగా నమిలిన తర్వాతే తినాలని, అలా నమలకపోతే ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. పిండితో తయారైన మోమోలను నమలకపోతే గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాపాయం కలుగుతుంది. అలాగే మోమోస్‌ను అధికంగా తినడం మానుకోండి. ఎందుకంటే పిండి హాని చేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఛాలెంజ్‌లో గెలవడానికి బిపిన్ పాశ్వాన్ ఏకంగా 150 మోమోలు తిన్నాడని కొన్ని మీడియా నివేదికలలో పేర్కొంది.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?