
రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కు కర్ణాటక సర్కార్ షాక్ ఇచ్చింది. బీజేపీ హయాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధమైన పబ్లిక్ సర్వీస్ ట్రస్ట్‌కు కేటాయించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.35.33 ఎకరాల భూమిని ఆర్ఎస్ఎస్ కు అప్పగించడంపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. వాస్తవానికి గత (బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి.. కొంత ప్రాసెస్ చేసింది. అయితే.. సిద్దరామయ్య సర్కార్ మాత్రం ఇవ్వడం కూదరదని తేల్చి చెప్పింది.
ఈ చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీన్ని విద్వేష రాజకీయాలుగా అభివర్ణించింది. బెంగళూరులోని 35.33 ఎకరాల భూమిని ట్రస్టుకు గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వం కేటాయించింది.
ట్రస్ట్ చన్నేనహళ్లిలో విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. వివిధ సంస్థలకు ఇచ్చిన ప్రభుత్వ భూమికి సంబంధించి అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఎస్‌టి సోమశేఖర్ అడిగిన ప్రశ్నకు కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో ట్రస్ట్‌కు కేటాయించిన 35.33 ఎకరాల భూమిపై స్టే విధించినట్టు పేర్కొన్నారు. భూమిని ట్రస్టుకు అప్పగించకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ మే 25న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జారీ చేసిన నోట్‌ను ఉదహరించారు. అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు బీజేపీ చేసిన కేటాయింపులను ప్రభుత్వం సమీక్షిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
విధానసౌధలో ప్రార్థనలు చేయవద్దు: శ్రీరామ సేన హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వం విధానసౌధలో ముస్లింలకు ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తే పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని కర్ణాటకలోని శ్రీరామసేన శుక్రవారం హెచ్చరించింది. ప్రార్థనలకు అనుమతిస్తే విధానసౌధ ఆవరణలో ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ హెచ్చరించారు.