ల్యాండ్ మాఫియా అరాచకం.. ప్రభుత్వ హాస్పిటల్‌నే అమ్మకానికి పెట్టిన వైనం

Published : Apr 22, 2022, 08:07 PM ISTUpdated : Apr 22, 2022, 08:09 PM IST
ల్యాండ్ మాఫియా అరాచకం.. ప్రభుత్వ హాస్పిటల్‌నే అమ్మకానికి పెట్టిన వైనం

సారాంశం

బిహార్‌లో భూబకాసురులు ఏకంగా ప్రభుత్వ హెల్త్ కేర్ ఫెసిలిటీనే అమ్మకానికి పెట్టారు. దీనికి సంబంధించి సెటిల్‌మెంట్ కోసం అధికారులకు అందిన విజ్ఞప్తితో ఈ స్కామ్ బయటకు వచ్చింది. కాగా, గ్రామస్తులు ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీని మూసేయరాదని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.  

న్యూఢిల్లీ: బిహార్‌లో ల్యాండ్ మాఫియా అరాచకం సృష్టిస్తున్నది. ఏకంగా ప్రభుత్వ ఆరోగ్య వసతినే అమ్మకానికి పెట్టారు. ముజఫర్‌పూర్‌లోని కుడ్ని ఏరియాలో జమూరా పంచాయతీ బ్లాక్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హెల్గ్ కేర్ ఫెసిలిటీకి సంబంధించి సెటిల్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి లేఖలు సర్కిల్ ఆఫీసర్ దగ్గరకు రావడంతో విషయం బయటపడింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, గోపాల్ శరణ్ సింగ్ ఒక ఎకరా భూమిని 1975లో ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇందులోనే హెల్త్ కేర్ ఫెసిలిటీని నిర్మించారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఇక్కడ నిర్మించినట్టు దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఇక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీ నడుస్తున్నది. చుట్టు పక్కల గ్రామాల వారు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. ఇందులో ఆక్సిలరీ నర్స్ హైబ్రీడ్‌గానూ గుర్తించారు. అంటే ఇక్కడే ఏఎన్ఎం, ఆయుష్ హెల్త్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నారు.

అలాంటి ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీ, ఈ భూమిపై భూబకాసురులు కన్నేశారు. ఇప్పటికే 36 డెసిమిల్ భూమిని అమ్మేసినట్టు ఈ భూకుంభకోణంపై చేసిన దర్యాప్తు వెల్లడించింది.

ఈ హెల్త్ ఫెసిలిటీలో అనేక మంది మహిళా వైద్యులు ఉన్నారని, ఇతర చికిత్సలు చేయడానికి వైద్యులు ఉన్నారని జమూరా గ్రామానికి చెందిన సుశీల దేవీ తెలిపారు. కాబట్టి, ఈ హాస్పిటల్‌ను మూసేయరాదని ప్రభుత్వానికి కోరుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆ గ్రామానికి చెందిన ఇతరులు కూడా ఆమె వ్యాఖ్యలనే వల్లిస్తున్నారు. గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారని, వారు ఏ అనారోగ్యానికైనా ఈ హాస్పిటల్‌పైనే ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ఇతర చోట్లకు వెళ్లి వైద్యం చేయించుకునే తాహతు లేదని వాపోతున్నారు. కాబట్టి, ఈ హాస్పిటల్‌ను ఎట్టిపరిస్థితుల్లో మూసేరాదని కోరుతున్నారు.

ఈ ఘటనపై కుడ్నీ సర్కిల్ ఆఫీసర్ పంకజ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ హెల్త్ కేర్ ఫెసిలిటీని ల్యాండ్ మాఫియా అమ్మాలనుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చిందని వివరించారు. గోపాల్ శరణ్ సింగ్ భూమిని దానం చేసిన తర్వాత ఇక్కడ హెల్త్ ఫెసిలిటీ నిర్మించారని చెప్పారు. ఆ తర్వాత గోపాల్ శరణ్ సింగ్ తనయుడు కూడా మరణించాడని పేర్కొన్నారు. ఇప్పటికైతే ఆ భూమి సెటిల్‌మెంట్ సంబంధించిన ప్రాసెస్‌ను నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ఒక వేళ ఈ స్కామ్ నిజమని తేలితే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !