Bihar Exit Poll 2020: తేజశ్విదే బీహార్ పీఠం, ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నిటిదీ అదే మాట

Published : Nov 07, 2020, 09:37 PM ISTUpdated : Nov 07, 2020, 09:59 PM IST
Bihar Exit Poll 2020: తేజశ్విదే బీహార్ పీఠం, ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నిటిదీ అదే మాట

సారాంశం

నితీష్ కుమార్ పాపులారిటీ అనూహ్యంగా తగ్గిపోయింది. తేజశ్వి యాదవ్ నాయకత్వంలోని మహాగటబంధన్ ఎన్డీయే కన్నా ముందంజలో ఉంది. 

బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒపీనియన్ పోల్ ఫలితాలకన్నా భిన్నంగా బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. నితీష్ కుమార్ పాపులారిటీ అనూహ్యంగా తగ్గిపోయింది. తేజశ్వి యాదవ్ నాయకత్వంలోని మహాగటబంధన్ ఎన్డీయే కన్నా ముందంజలో ఉంది. 

ప్రముఖమైన సంస్థలు చాణక్య, ఇండియా టుడే మై ఇండియా ఆక్సిస్ లు బీహార్ లో తేజశ్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చేశాయి. చాణక్య ఘట్ బంధన్ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని తెలిపింది. 

సి ఓటర్, జన్ కి బాత్, డీవీ రీసెర్చ్, టీవీ9 వంటి సంస్థలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చెప్పాయి. ఇవి ఎగ్జిట్ పోల్ ఫలితాలే అయినప్పటికీ... వీటిని అనుసరించి చూస్తే బీహార్ లో ఎన్డీయే కి గట్టి షాక్ తగిలేలానే కనబడుతుంది.  ఒకసారి సర్వేలను చూద్దాము. 

ఇండియా టుడే  ఆక్సిస్ మై ఇండియా సర్వే

ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 69 - 91

మహాగటబంధన్ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 139 - 161

ఎల్జేపీ:  3 - 5

ఇతరులు: 3 - 5

టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే:

ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 116

యూపీఏ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 120

ఎల్జేపీ:  1

ఇతరులు: 6

రిపబ్లిక్, జన్ కీ బాత్ సర్వే:

ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 91- 117

యూపీఏ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 118-138

ఎల్జేపీ:  5-8

ఇతరులు: 3-6

దైనిక్ భాస్కర్ సర్వే:

ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 120 - 127

మహాగటబంధన్ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 71 - 81

ఎల్జేపీ:  12 - 23

ఇతరులు: 19 - 27

PREV
click me!

Recommended Stories

Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!