బీహార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.... పార్టీ అధికార ప్రతినిధి రాజీనామా

By Arun Kumar PFirst Published Mar 10, 2019, 12:09 PM IST
Highlights

 ఇప్పటికే బీహార్ లో బలహీనంగా వున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి వినోద్ శర్మ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్పై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం నచ్చకపోవడంతోనే తాను పార్టీని వీడుతున్నానని ఆయన వెల్లడించడం మరింత సంచలనానికి దారితీసింది. 

పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత వైమానిక దళాలు పాక్ లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాయి. వీటిలో దాదాపు 300మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్రం ప్రకటించింది. అయితే బిజెపి సర్జికల్ స్ట్రైక్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని...దీనిద్వారా లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేయడాన్ని తట్టుకోలేకపోయానని శర్మ తెలిపాడు. అందువల్లే అలాంటి పార్టీలో వుండకూడదని నిర్ణయించుకుని పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి పంపినట్లు వినోద్ శర్మ వెల్లడించారు. 

ఉల్వామా ఉగ్రదాడి...ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడుల అనంతరం రాహుల్ గాంధీ దేశ సైనిక దళాలకు అండగా నిలిచారు. దేశ రక్షణ కోసం సైన్యం తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము మద్దతిస్తామని ప్రకటించారు. ఈ విషయాలపై ఎలాంటి రాజకీయాలుండవని ప్రకటించారు. కానీ ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్ పై సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే  మాట్లాడుతూ... అసలు ఈ దాడులు జరిగాయని ఎలా నమ్మాలి.. దీనికి సంబంధించిన ఆదారాలను బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇలా ఆధారాలు కావాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టిన వినోద్ శర్మ... ఆ కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 
 
click me!