కమల్ పార్టీకి ‘‘టార్చ్‌లైట్‌’’ను కేటాయించిన ఈసీ

Siva Kodati |  
Published : Mar 10, 2019, 11:12 AM IST
కమల్ పార్టీకి ‘‘టార్చ్‌లైట్‌’’ను కేటాయించిన ఈసీ

సారాంశం

మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ను గుర్తుగా కేటాయించింది. 

మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ను గుర్తుగా కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన ఈసీకి ట్వీట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

‘‘ మా పార్టీకి తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యం టార్చ్ బేరర్‌గా మారబోతోంది. మాకు టార్చ్‌లైట్ గుర్తును కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు’’ అనీ కమల్ ట్వీట్ చేశారు.

2018 ఫిబ్రవరి 21న ఆయన పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరితోనూ పొత్తు ఉండదని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని, అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నామని కమల్ తెలిపారు. డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం