బీహార్ మాజీ ముఖ్యమంత్రి సదానంద్ సింగ్ కన్నుమూత..

Published : Sep 08, 2021, 12:06 PM ISTUpdated : Sep 08, 2021, 12:16 PM IST
బీహార్ మాజీ ముఖ్యమంత్రి సదానంద్ సింగ్ కన్నుమూత..

సారాంశం

ఈ మేరకు బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ట్విటర్ లో స్పందించారు. ‘బీహార్ కు చెందిన ప్రముఖ నేత, కాంగ్రెస్ యోధుడు సదానంద్ సింగ్  ఈ రోజు కన్నుమూశారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు. 

పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్షనేత సదానంద్ సింగ్ కన్నుమూశారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.  సందర్భంగా బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్.. సదానంద్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ట్విటర్ లో స్పందించారు. ‘బీహార్ కు చెందిన ప్రముఖ నేత, కాంగ్రెస్ యోధుడు సదానంద్ సింగ్  ఈ రోజు కన్నుమూశారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు. 

కాగా సదానంద్ సింగ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా సదానంద్ సింగ్ మృతికిి సంతాపం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌