
పాట్నా: ఆయన ముఖ్యమంత్రి(Chief Minister). కానీ, ఆయన కంటే.. కొడుక్కే ఆస్తులెక్కువ. ఐదు రెట్లు తండ్రి కంటే ఎక్కువ సంపన్నుడు. అంతేకాదు, ఆ ముఖ్యమంత్రికి మంత్రివర్గ సభ్యుల(Cabinet Ministers) కంటే కూడా ఆస్తులు(Assets) తక్కువగా ఉన్నట్టు డిసెంబర్ 31వ తేదీన బిహార్(Bihar) ప్రభుత్వ వెబ్‌సైట్ వెల్లడించింది. బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)కు స్థిర, చరాస్తులు సుమారు రూ. 75.36 లక్షలు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, నితీష్ కుమార్ ఆస్తుల కంటే ఆయన కొడుకు ఆస్తులే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీ క్యాబినెట్ మంత్రుల ఆస్తులు తప్పకుండా వెల్లడించాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించారు.
సీఎం, మంత్రివర్గ సభ్యులు ఆస్తుల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో డిసెంబర్ 31వ తేదీన అప్‌లోడ్ చేశారు. సీఎం నితీష్‌కు రూ. 29,385 నగదు రూపంలో ఉన్నాయి. రూ. 42,763లు బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఉన్నాయి. కాగా, నితీష్ కుమార్ కొడుకు నిషాంత్ దగ్గర నగదు రూ. 16,549 ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 1.28 కోట్లు ఉన్నట్టు ప్రభుత్వం వివరించింది. నితీష్ కుమార్ దగ్గర చరాస్తి రూ. 16.51 లక్షలు, స్థిరాస్తి రూ. 58.85 లక్షలు ఉన్నట్టు తెలిపింది. కాగా, ఆయన కొడుకు చరాస్తి విలువ రూ. 1.63 కోట్లు, స్థిరాస్తి విలువ రూ. 1.98 కోట్లు ఉన్నట్టు వివరించింది.
Also Read: Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఐటీ షాక్.. 1000 కోట్ల ఆస్తులు సీజ్..
న్యూఢిల్లీలోని ద్వారకాలోని ఓ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో నివాస ఫ్లాట్‌లో ముఖ్యమంత్రికి ఒక ఫ్లాట్ ఉన్నది. కాగా, ఆయన కొడుకుకు సాగు భూమి, పలు చోట్ల ఇళ్లు ఉన్నాయి. కళ్యాణ్ బిఘా, హకీకత్‌పుర్‌లో, కంగర్‌బగ్‌లో రెసిడెన్షియల్ ఫ్లాట్‌లు ఉన్నాయని వివరించింది. నిషాంత్‌కు తమ పూర్వీకుల గ్రామంలో కళ్యాణ్ బిఘాలో సాగు భూమి ఉన్నది. వ్యవసాయేతర భూమి కూడా ఉన్నది. కాగా, సీఎం నితీష్ కుమార్ తనకు 13 ఆవులు కూడా ఉన్నట్టు తెలిపారు. సీఎంతోపాటు ఆయన ఇద్దరు ఉపముఖ్యమంత్రులు తారకిశోర్ ప్రసాద్, రేణు దేవిలూ తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సీఎం నితీష్ కుమార్ కంటే.. ఆయన కొడుక్కే కాదు.. క్యాబినెట్ మంత్రుల ఆస్తులూ ఎక్కువగా ఉన్నాయి.
Also Read: జగన్ ఎందుకు హాజరు కావడం లేదు... అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ప్రశ్న...
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేతల అజిత్ పవర్‌కు (Ajit Pawar) సంబంధించిన ఆస్తులను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (IT Dept) సీజ్ చేసింది. బినామీ చట్టం కింద ఈ ఆస్తులను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఆస్తులు విలవ రూ. 1,000 కోట్లు ఉంటుందని అంచనా. అజిత్ పవార్ సన్నిహితులతో ముడిపడి ఉన్న మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా జప్తు చేసింది. వీటిలో సౌత్ ఢిల్లీలో రూ.20 కోట్లు విలువైన ఓ ఫ్లాట్, నిర్మల్ హౌస్‌లో ఉన్న పవార్ ఆఫీసు విలువ రూ.25 కోట్లు, జరందేశ్వర్‌లో రూ.600 కోట్ల విలువైన షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో రూ.250 కోట్ల ఖరీదు చేసే రిసార్ట్‌లను బినామీ ఆస్తులుగా ఐటీ అధికారులు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ నేరుగా పవార్‌కు చెందినవి కావనీ, ఆయన సన్నిహితులకు ముడిపడి ఉన్నవేనని సమాచారం.