
బీహార్‌లోని సివాన్‌లో ఓ జుగుస్పాకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మత గురువు.. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన అందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్టు తెలుస్తోంది. వైరలవుతున్న వీడియోలో మత గురువు ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. ఈ జుగుస్పాకరమైన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సివాల్ జిల్లా అందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్టు గుర్తించారు. ఆ కామాంధుడు ఒక మౌల్వీ అనీ, అతడు అందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్ బాబా సమాధి వద్ద భూతవైద్యం చేస్తుండని గుర్తించారు. భూతవైద్యం కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలు, బాలికలు అతడి దగ్గరికి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక విద్యార్థిని అతని వద్దకు వచ్చింది. ఆ బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు మాటలు కలిపాడు.
ఇంతలో అతడు.. ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇష్టవచ్చిన చోట్ల తాకాడు. తర్వాత మైనర్ బాలికను దగ్గరికి గట్టిగా తన వైపు లాక్కొని.. ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. తొలుత విద్యార్థిని అతన్ని దూరంగా పెట్టింది. ఆ తర్వాత ఏమీ జరిగిందో తెలియదు గానీ .. ఆ బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని అందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అందర్ బజార్ నివాసి సలావుద్దీన్ అన్సారీగా గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామంలో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. వైరల్ వీడియోపై సమాచారం అందిందని అందర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కుమార్ వైభవ్ తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.