నకలు చిట్టీని లవ్ లెటర్‌గా పొరబడిన బాలిక.. అబ్బాయిని చంపేసిన ఆమె సోదరులు

By Mahesh KFirst Published Oct 20, 2022, 8:54 PM IST
Highlights

బిహార్‌లో దారుణం జరిగింది. ఎగ్జామ్ హాల్‌లోకి ఓ బాలుడు విసిరిన చిట్టిన లవ్ లెటర్‌గా ఓ బాలిక పొరబడింది. ఆ విషయాన్ని ఆమె తన సోదరులకు తెలిపింది. ఆ బాలిక సోదరులు మరికొందరు మిత్రులను వెంటబెట్టుకుని చిట్టి విసిరిన బాలుడిని బాది... కత్తితో నరికి దారుణంగా చంపేశారు.
 

న్యూఢిల్లీ: బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల అబ్బాయిని ఇతర మైనర్ బాలురు దారుణంగా హతమార్చారు. కత్తులతో పొడిచి చేతులు, కాళ్లు నరికేసి చంపేసి ట్రైన్ ట్రాక్ పక్కన పడేశారు. ఎగ్జామ్ సెంటర్‌లో బాలికకు విసిరిన నకలు చిట్టిని లవ్ లెటర్‌గా పొరబడటం మూలంగా ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటన భోజ్‌పూర్‌లో గతవారం చోటుచేసుకుంది. మహత్‌బనియా ఆల్ట్ స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం బాడీ పార్టులను పోలీసులు రికవరీ చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఐదో తరగతి చదువుతున్న చెల్లికి గతవారం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్ష కోసం తన చెల్లిని ఆరో తరగతి చదువుతున్న బాలుడు వెంట తీసుకెళ్లాడు. పరీక్షలో సహాయం చేద్దామని తన చెల్లె కోసం ఆ బాలుడు ఓ చిట్టిని పరీక్షా కేంద్రంలోకి విసిరాడు. కానీ, ఆ చిట్టి తన చెల్లి దగ్గరకు కాకుండా మరరో బాలిక వద్దకు వెళ్లి పడింది. ఆ బాలిక దాన్ని తప్పుగా భావించింది. నకలు చిట్టి అనుకోకుండా తనకు ఆ అబ్బాయి లవ్ లెటర్ విసిరాడని అనుకుంది. అదే విషయాన్ని తన సోదరులకు తెలిపింది. 

దీంతో ఆ సోదరులు మరికొందరు మిత్రులతో వెళ్లి చిట్టి విసిరిన బాలుడిపై దాడి చేశారు. ఎంతగానంటే అతి క్రూరంగా దారుణంగా నరికి చంపారు. ఆ బాధిత బాలుడి చెల్లి ఇంటికి వెళ్లి అన్నపై దాడి జరిగిందని తల్లిదండ్రులకు తెలిపింది. వారు ఆ బాలుడి కోసం గాలించారు. దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: బంజారాహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సీరియస్... నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌కు ఆదేశం

ఆ తర్వాత ఓ వ్యక్తికి ట్రాక్ దగ్గర బాలుడి చేయి కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు విషయం చేరవేశాడు. వారు వెంటనే వచ్చి మిగిలిన బాడీ కోసం వెతికి పట్టుకున్నారు. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి డెడ్ బాడీని గుర్తించాలని అడిగారు. మరణించిన బాలుడు వేసుకున్న టీషర్ట్ చూసి ఆ డెడ్ బాడీ తమ బిడ్డదే అని వారు గుర్తించారు. 

డీఎస్పీ వినోద్ కుమార్ సింగ్, ఇతర అధికారులు ఆ అబ్బాయి కుటుంబాన్ని కలుసుకుని వివరాలు తీసుకున్నారు. మరణించిన 12 ఏళ్ల బాలుడు ఇంటెలిజెంట్ బాయ్ అని తెలిపారు. పోలీసులు దాడి చేసిన అందరినీ అదుపులోకి తీసుకుని జువెనైల్ హోమ్‌కు తరలించారు. దాడి చేసినవారందరూ మైనర్లే అని వివరించారు.

click me!