భూమికి చేరువగా చంద్రుడు.. బుధవారం అతిపెద్ద సూపర్‌మూన్.. ఎప్పుడు చూడాలంటే?

Published : Jul 11, 2022, 02:05 PM IST
భూమికి చేరువగా చంద్రుడు.. బుధవారం అతిపెద్ద సూపర్‌మూన్.. ఎప్పుడు చూడాలంటే?

సారాంశం

ఈ బుధవారం సూపర్‌మూన్ ఆవిష్కృతం కానుంది. బుధవారం అర్ధరాత్రి చంద్రుడు భూమికి అతి చేరుగా రానున్నాడు. దీంతో చంద్రుడు అతిపెద్దగానే, ప్రకాశవంతంగానూ కనిపించబోతున్నాడు.  

న్యూఢిల్లీ: ఖగోళ దృశ్యాలేవైనా అద్భుతంగానే అనిపిస్తాయి. మనకు ఎప్పుడూ కనిపించే రెండు అతిపెద్ద సెలెస్టియల్ బాడీలు ఒకటి సూర్యుడు.. మరొకటి చంద్రుడు. సూర్యుడిని నేరుగా చూడలేకున్నా.. చంద్రుడిని చూస్తూ ఆహ్లాదంగా సమయాన్ని గడపొచ్చు. అదే పౌర్ణమి నాడు మరీ అందంగా కాంతిలీనుతూ మనకు కనిపిస్తాడు. ఇలా జాబిల్లిని చూస్తూ ఆనందించే వారికి గొప్ప వార్త. ఈ బుధవారం చంద్రుడు భూమికి అతిసమీపంగా రానున్నాడు. అందుకే అతిపెద్దగానూ కనిపించబోతున్నాడు. 

జులై 13వ తేదీన చంద్రుడు భూమికి అతి చేరువగా వస్తున్నాడు. అంటే భూమి నుంచి 3,57,264 కిలోమీటర్ల వరకు దగ్గరగా వస్తున్నాడు.

భూమికి చంద్రుడు ఇంత దగ్గరగా రావడం మూలంగా భూమిపై ఉన్న సముద్రాలు పోటుకు గురవుతాయి. ఈ టైడల్ ఎఫెక్ట్ కారణంగా సముద్రాలు ఎత్తైన లేదా లోతైన అలలు ఏర్పరుస్తాయి. భూమి, చంద్రుడు.. ఈ రెంటికీ ఆకర్షించే శక్తి ఉంటుందని తెలిసిందే. భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు ఉపగ్రహం ఆకర్షణ శక్తి కారణంగా భూమిపై సులువుగా వాటికి లోనయ్యే నీరు కొంత వికలం చెందుతుంది.

ఇంతకీ సూపర్‌మూన్ అంటే ఏమిటీ?

సూపర్‌మూన్ అంటే.. అదేదో అతీత శక్తులు చంద్రుడికి ఆవహిస్తాయని కాదు. కానీ, సాధారణ పౌర్ణమి రోజుల్లోలా కాకుండా కొంత పెద్దగా (ఆకారం) చంద్రుడు మనకు కనిపిస్తాడు. అంతేకాదు, ప్రకాశవంతంగానూ కనిపిస్తాడు. ఇది ఎందుకంటే.. భూమి చుట్టూ చంద్రుడు దీర్ఘ వృత్తాకర కక్ష్యలో తిరుగుతాడని తెలిసిందే. ఈ దీర్ఘవృత్తాకర కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు పౌర్ణమి రావడమే సూపర్‌మూన్ అంటే. చంద్రుడి కక్ష్యలో భూమికి సమీపంగా ఉన్న ఆ పొజిషన్ (స్థితి)ను పెరిజీ అంటారు. అదే భూమికి దూరంగా ఉండే చంద్రుడి కక్ష్య స్థితిని అపొజీ అంటారు. ఈ పొజిషన్‌లో భూమికి చంద్రుడు 4,05,550 కిలోమీటర్ల దూరంలో (భూమి, చంద్రుడి మధ్య ఇదే గరిష్ట దూరం) ఉంటాడు. భూమికి దగ్గరగా వచ్చే పౌర్ణమినాటి చంద్రుడినే సూపర్‌మూన్ అంటారు.

ఎప్పుడు చూడాలంటే?

ఈ ఏడాదిలో అతిపెద్దగా జులై 13వ తేదీనే చంద్రుడు కనిపించబోతున్నాడు. ఈ సూపర్ మూన్ బుధవారం రాత్రి 12.07 నిమిషాలకు దర్శనం ఇవ్వనుంది. మళ్లీ వచ్చే ఏడాదిలో జులై 3వ తేదీన సూపర్‌మూన్ కనిపిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్