మహిళకు బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులు: షాకిచ్చిన బాధితురాలు (వీడియో)

Published : Oct 16, 2018, 02:56 PM ISTUpdated : Oct 16, 2018, 05:57 PM IST
మహిళకు బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులు: షాకిచ్చిన బాధితురాలు (వీడియో)

సారాంశం

లోన్ కావాలని కోరిన ఓ మహిళను  లైంగిక వేధింపులకు గురిం చేశాడు ఓ బ్యాంకు మేనేజర్. అయితే ఆ బ్యాంకు మేనేజర్‌ను  ఆ మహిళ చితకబాదింది

బెంగుళూరు: లోన్ కావాలని కోరిన ఓ మహిళను  లైంగిక వేధింపులకు గురిం చేశాడు ఓ బ్యాంకు మేనేజర్. అయితే ఆ బ్యాంకు మేనేజర్‌ను  ఆ మహిళ చితకబాదింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కర్ణాటక రాష్ట్రంలోని దేవనగెరె జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. దేవనగెరెలోని డీహెచ్ఎఫ్ఎల్ లోన్ ఏజెన్సీలో  దేవయ్య అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.  ఆయన వద్దకు ఓ మహిళ లోన్ కోసం వెళ్లింది.

రూ.2 లక్షల రుణం కావాలని ఆమె కోరింది.  అయితే  రుణం కోసం వచ్చిన ఆ మహిళను  బ్యాంకు మేనేజర్ దేవయ్య లైంగికంగా వేధించాడు. కొంతకాలం పాటు ఆమె ఈ వేధింపులను తట్టుకొంది. ఆ తర్వాత ఈ వేధింపులను  భరించలేక  దేవయ్యను బ్యాంకు నుండి బయటకు లాగి కర్రతో చితక్కొట్టింది.

తన కోపాన్ని ఆపుకోలేక చెప్పు తీసుకొని  ఇష్టమొచ్చినట్టు  చితకబాదింది. మేనేజర్‌ను ఆ మహిళ చితకబాదుతున్న వీడియోను కొందరు  రికార్డు చేశారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

                        "

 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu