మమ్మల్ని అంటరాని పార్టీగా చూశారు: అసదుద్దీన్ ఓవైసీ

By narsimha lodeFirst Published Nov 11, 2020, 11:15 AM IST
Highlights

హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓైసీకి చెందిన ఎఐఎంఐఎం బీహార్ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. 2019లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఎంఐఎం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది.


పాట్నా:హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓైసీకి చెందిన ఎఐఎంఐఎం బీహార్ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. 2019లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఎంఐఎం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది.

రాజకీయాల్లో మీరు చేసిన తప్పు నుండి మీరు నేర్చుకొంటారని అసద్ చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి చెందిన నేతను కలిసినట్టుగా చెప్పారు. ముఖ్యమైన ముస్లిం నేతలను కూడ కలిశారని ఆయన గుర్తు చేశారు. కానీ, తమ పార్టీని అంటరాని పార్టీగా చూశారన్నారు.

కానీ మా పార్టీ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించిందని ఓవైసీ చెప్పారు. బీహార్ లో ఏ పార్టీకి తాము మద్దతిస్తామో తర్వాత చెబుతామని ఆయన తెలిపారు.

ఇవాళ మాకు మంచి రోజు. బీహార్ ప్రజలు తమకు ఓటేశారు. అంతేకాదు వారి ఆశీర్వాదాలు కూడ అందించారని అసద్ అభిప్రాయపడ్డారు. తమకు ఓటు వేసిన వారికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడం లేదని అసద్ మీడియాకు చెప్పారు.

also read:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020: హిల్సాలో 12 ఓట్లతో జేడీ(యూ) అభ్యర్ధి విజయం

తమ పార్టీ ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెడతామన్నారు. కరోనా ఉన్నా కూడ ప్రజలు బయటకు వచ్చి తమ పార్టీకి ఓటేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  ఇంకా కొన్ని సీట్లు గెలవాల్సి ఉంది. కానీ లోపం ఎక్కడ ఉందో తెలియదు... ఈ విషయమై తాము చర్చించి నిర్ణయం తీసుకొంటామని అసద్ తెలిపారు.

బీహార్ లో తమను బీజేపీకి బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని ఎంఐఎం నేతలు గుర్తు చేస్తున్నారు.

ఐదేళ్ల క్రితం బీహార్ లో తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినట్టుగా అసద్ తెలిపారు. సీమాంచల్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. తాము ఎవరికి మద్దతు ఇస్తామో తర్వాత నిర్ణయిస్తామని అసద్ తెలిపారు.

సీమాంచల్ కు న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతోందని ఆయన చెప్పారు.

click me!