నక్సలిజాన్ని తుడిచేస్తామని అమిత్ షా కామెంట్.. ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులపై బిగ్ ఆపరేషన్

By Mahesh KFirst Published Jan 12, 2023, 3:54 PM IST
Highlights

ఛత్తీస్‌గడ్ బుధవారం భ్రదతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవలి కాలంలో నక్సల్స్ పై జరిగిన పెద్ద ఆపరేషన్ ఇదే. మావోయిస్టు బెటాలియన్1 కు చెందిన అనేక ఎన్‌కౌంటర్ల వెనుక మాస్టర్ మైండ్‌గా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2024 జనరల్ ఎలక్షన్స్‌కు ముందే నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోం శాఖ అన్నారు.
 

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌లో భద్రతా బలగాలు బిగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ ముఖ్యంగా మద్వి హిడ్మా టార్గెట్‌గా జరిగినట్టు తెలుస్తున్నది. బుధవారం ఛత్తీస్‌గడ్‌లో మెరుపు దాడులకు దిగాయి. ఇటీవలి కాలంలో జరిగిన పెద్ద ఆపరేషన్‌గా దీన్ని పేర్కొంటున్నారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, డ్రోన్లు, కోబ్రా కమాండోలు, ఛత్తీస్‌గడ్ పోలీసులు, తెలంగాణ పోలీసులకు చెందిన గ్రేహౌండ్ స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ పాలుపంచుకున్నాయి. 2024 (జనరల్ ఎన్నికలకు ముందే) కల్లా నక్సలిజాన్ని తుడిచేస్తామని ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ బిగ్ ఆపరేషన్ జరగడంతో చర్చనీయాంశంగా మారింది.

మావోయిస్టుల్లో హిడిమా గ్రూప్‌ను బెటాలియన్‌ 1గా గుర్తిస్తారని ఓ కథనం పేర్కొంది. 55 ఏళ్ల మద్వి హిడ్మా అనేక ఎన్‌కౌంటర్‌లకు మాస్టర్ మైండ్‌గా ఉన్నారనే వాదనలు ఉన్నాయి. 2004 నుంచి రెండు డజన్లకు మించిన ఎన్‌కౌంటర్‌లలో ఆయన ప్రమేయం ఉన్నట్టు ఎన్డీటీవీ పేర్కొంది. ఇందులో 2013లో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన ఎన్‌కౌంటర్, అదే ఏడాదిలో ఝిరామ్ ఘాత అటాక్‌లు ఉన్నాయి. మద్వి హిడ్మాపై రూ. 45 లక్షల బౌంటీ ఉన్నది.

తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతానికి సీఆర్‌పీఎఫ్ కోబ్రాలను తరలించాలని నిర్ణయం జరిగింది. సుక్మా, బీజాపూర్ సరిహద్దుల్లోని చిక్కని అడవిలోని ఆపరేటింగ్ బేస్‌కు వీరిని తరలించే ప్రక్రియ మొదలైంది. అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ బలగాలు మారుమూల ప్రాంతం వైపు వెళ్లుతుండగా మావోయిస్టులే వారిపై దాడులు జరిపినట్టు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పీ సుందర్ రాజ్ తెలిపారు. కోబ్రా వైపు మరణాలు లేవని చెప్పారు. మావోయిస్టుల వైపు జరిగిన నష్టాన్ని, ఎవరైనా గాయపడ్డారా? మరణించారా? అనే విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నామని పేర్కొన్నారు.

Also Read: రాజౌరిలో ఎన్ కౌంటర్ ప్రారంభం.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చేందుకు భద్రతా బలగాల ఆపరేషన్

మావోయిస్టులు దాడి చేయడంతో తాము ప్రాణ రక్షణ కోసం తిగిరి ఫైరింగ్ జరపాల్సి వచ్చిందని కొన్ని భద్రతా వర్గాలు వివరించాయి. మావోయిస్టుల దాడికి బదులిస్తుండగా ఆరుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు తెలిసింది. అలాగే, బుల్లెట్‌తో గాయాలున్న ఆర్మీ చాపర్ సుక్మాలోని ఎల్మగుడ క్యాంప్‌లో ల్యాండ్ చేశారు. 

ఉదయం 11 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు వైమానిక దాడులకు పాల్పడినట్టు మావోయిస్టులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందలేదని లేఖలో తెలిపారు. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖ విడుదలైంది. హిడ్మా చనిపోయినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. హిడ్మా సేఫ్‌గానే ఉన్నట్టుగా చెప్పారు. దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు.. డ్రోన్‌లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయని ఆరోపించారు. 

click me!