ఒడిశాలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు

Published : Jan 29, 2020, 08:15 AM ISTUpdated : Jan 29, 2020, 08:24 AM IST
ఒడిశాలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు

సారాంశం

ఒడిశా రాష్ట్రంలో ఓ బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

భువనేశ్వర్:ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఒడిశా రాష్ట్రంలోని తప్తాని ఘాట్ జిల్లాలోని పాలుకోలా వద్ద బ్రిడ్జి నుండి లోయలో ఓ బస్సు పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడినవారిని దిగంపహడి, బెర్హంపురి ఆసుపత్రులకు తరలించారు. 

Also read:మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

పాటపూర్ పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.టికిరి నుండి బస్సు బెర్హంపుర్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని స్థానికులు చెప్పారు.

ఈ ప్రమాదం బుధవారం నాడు తెల్లవారుజాము మూడు గంటలకు జరిగిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం చుట్టూ నీరు ఉన్నందున సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా అధికారులు చెప్పారు.

లోయలో బస్సుపడినందు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు అగ్నిమాపక సిబ్బంది సమీప ప్రాంతాల నుండి ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటే.?
Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu