నిర్బయ కేసులో మరో ట్విస్ట్: సుప్రీంలో మూడో దోషి క్యురేటివ్ పిటిషన్

By telugu teamFirst Published Jan 29, 2020, 8:11 AM IST
Highlights

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేీదీన ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారంట్ జారీ అయిన నేపథ్యంలో మూడో దోషి సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో మూడో దోషి అక్షయ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారంనాడు అతను ఆ పిటిషన్ దాఖలు చేసినట్లు తీహార్ జైలు అధికారులు చెప్పారు. 

నిర్భయ కేసు దోషులు నలుగురికి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయడానికి డెత్ వారంట్ జారీ అయింది. ఈ స్థితిలో దోషులు న్యాయప్రక్రియకు సంబంధించిన అంశాలను వాడుకుంటూ ఆలస్యం చేసేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. 

రాష్ట్రపతి తన మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ముకేష్ కుమార్ సింగ్  దాఖలు చేసుకున్న పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించనుంది. ఆర్. భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఆ తీర్పును వెలువరిస్తుంది. 

2012 డిసెంబర్ లో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని రేప్ చేసి, చిత్రహింసలు పెట్టిన చంపిన కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరి శిక్ష వేయనున్నారు. ఆరుగురు దోషుల్లో ఒక్కడైన రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ మూడేళ్లు జువెనైల్ హోంలో ఉండి విడుదలయ్యాడు.

click me!